ఇస్రో వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మరో భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్యాయన్ తర్వాత గగన్ యాన్ ప్రాజెక్ట్ చేపట్టనుంది. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు సన్నాహాలు చేస్తోంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) గగన్ యాన్ -1 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్, మంగళ్యాన్, ఆదిత్యాయాన్ తర్వాత అంతకుమించి గగన్ యాన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. భారత్ చేస్తున్న తొలి మ్యాన్ మిషన్ ఇదే కావడం విశేషం. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు మొదటగా విశాఖపట్నం, గుజరాత్, తమిళనాడులో కీలకమైన ప్రయోగాలను గగన్ యాన్ కోసం ముందస్తు పరీక్షలను ఇస్రో చేపట్టనుంది.
బెంగళూరు నుంచి గగన్ యాన్ ప్రయోగానికి సంబంధించి క్రూ మాడ్యూల్‌ను శ్రీహరికోటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడాదిలోపు రోదసిలోకి వ్యోమగాములను పంపించి తిరిగి సురక్షితంగా భూమి పైకి తెచ్చే గగన్ యాన్1 మ్యాన్ మిషన్ ఇస్రో చేపట్టేందుకు అన్ని రకాల ప్రయోగాలను చేపడుతోంది. అక్టోబర్ మూడవ వారంలో గగన్ యాన్ ప్రయోగానికి సంబంధించి క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టమ్‌గా పిలిచే ప్రయోగాన్ని చేపట్టనుంది.
ఇస్రో చేపట్టే ఈ గగన్ యాన్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే పలు రకాల పరీక్షలను పూర్తి చేశారు. గగన్ యాన్ రాకెట్ ప్రయోగం చేపట్టే పనిలో ఇస్రో సైంటిస్టులు నిమగ్నమయ్యారు. రెండు పర్యాయాలు గగన్ యాన్ ట్రైల్ లాంచ్ ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది. ఆ తర్వాతే రాకెట్ నుంచి మానవ సహిత మాన్ మిషన్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. ఒక వేళ ఈ మిషన్ విఫలమయ్యే పరిస్థితి తలెత్తినప్పుడు అందులోంచి వ్యోమగాములను సురక్షితంగా బయటపడే సాంకేతికతపై ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. అయితే మానవుల కంటే ముందు హ్యూమనాయిడ్ వ్యోమమిత్ర అనే రోబోను ఇస్రో పరీక్షించనుంది.