One Teacher – One Student : ఒక్క విద్యార్థి వచ్చినా టీచర్ క్లాస్ లో పాఠాలు చెబుతాడని విన్నాం కానీ.. ఒకే ఒక్క స్టూడెంట్ కోసం స్కూల్ నడుస్తోందని.. ఆ విద్యార్థి కోసం ఒక టీచర్ కూడా పాఠాలు చెప్పడానికి వస్తున్నాడు. మహారాష్ట్రలోని వాసిం జిల్లాలో ఉన్న గణేశ్ పూర్ అనే చిన్న గ్రామంలో ఉండే ప్రైమరీ స్కూల్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది.
ఆ ఊరి జనాభానే 150 మంది. ఆ ఊరిలో ఉన్న ప్రైమరీ స్కూల్ కు ఒకే ఒక్క విద్యార్థి వస్తున్నాడు. మూడో తరగతిలో జాయిన్ అయిన ఆ విద్యార్థి కోసం ఒక టీచర్ ను కూడా అక్కడ అపాయింట్ చేశారు అధికారులు. కేవలం ఆ విద్యార్థి కోసం ఆ టీచర్ రోజూ స్కూల్ కు వస్తున్నాడు. వాసిం జిల్లా నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్కూల్ లో ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు చదువు చెప్పేలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ.. ఆ స్కూల్ లో చదివే విద్యార్థులు లేరు.
One Teacher – One Student : ఆ ఒక్క విద్యార్థి కోసం 12 కిమీల దూరం నుంచి వస్తున్న టీచర్
ఒక్క విద్యార్థి మాత్రమే ఆ స్కూల్ లో జాయిన్ అవడంతో ఆ స్కూల్ ను మూసేయకుండా రెండేళ్ల నుంచి ఒక టీచర్ ను ఆ స్కూల్ కు అసైన్ చేశారు. ఆ టీచర్ 12 కిలోమీటర్ల దూరం నుంచి ఆ స్కూల్ కు వస్తున్నారు. కేవలం ఆ విద్యార్థికి చదువు ఇవ్వడమే కాదు.. మధ్యాహ్న భోజన పథకం కింద ఒక్క విద్యార్థికి భోజన సధుపాయం కూడా ఏర్పాటు చేశారు అధికారులు. సాధారణంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాటించే నియమ నిబంధనలనే ఇక్కడ కూడా పాటిస్తానని.. ఆ స్టూడెంట్ కు అన్ని సబ్జెక్ట్స్ తానే బోధిస్తానని పాఠశాల టీచర్ చెప్పుకొచ్చారు.
Maharashtra | A Zilla Parishad primary school in Ganeshpur village of Washim district runs only for one student
Population of the village is 150. There is only one student enrolled in the school for the last 2 years. I'm the only teacher in school: Kishore Mankar, school teacher pic.twitter.com/h6nOyZXlDf