KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు 4 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు. ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా సెలవు, 26న బాక్సింగ్ డే ప్రభుత్వ సెలవు, 27, 28 తేదీల్లో మార్కెట్కు సాధారణ సెలవు ఉంటుందని పేర్కొన్నారు. తిరిగి 29 సోమవారం నుంచి మార్కెట్ పున ప్రారంభమవుతుందన్నారు.