E.G: రంగంపేట ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు.