NTR: వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్ అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు పేర్కొన్నారు. మంగళవారం గొల్లపూడిలో ఆయన చిత్రపటానికి స్థానిక నేతలతో కలసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అందువల్ల ఆయన జయంతినే కిసాన్ దివస్‌గా జరుపుకుంటున్నామన్నారు.