TG: ఖమ్మం జిల్లా పినపాక గ్రామంలో నూతన సబ్స్టేషన్ నిర్మాణాలకు Dy.CM భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయట్లేదని చెప్పారు. కానీ ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. KCRకు ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు.