»Mother Teresa Birth Anniversary Day Is The Womens Equality Day Why
Mother Teresa 113th Birth Anniversary దయ, కరుణకు మారు పేరు
మదర్ థెరిసా జయంతి ఈ రోజు.. ప్రతీ క్షణం నిరుపేదల సేవ కోసం పరితపించారు. జీవితం మొత్తం పేదల సేవ కోసం త్యాగం చేశారు. తన వద్ద ఉండేవారికి మౌలిక వసతులతోపాటు జీవితంలో నిలబడేందుకు భరోసా కల్పించారు.
Mother Teresa Birth Anniversary Day Is The Women's Equality Day Why..?
Mother Teresa: మదర్ థెరిసా (Mother Teresa).. దయ, కరుణకు మారు పేరు. ఆమెను సెయింట్ థెరిసా ఆఫ్ కోల్ కతా అని కూడా పిలుస్తారు. సేవా గుణం, చివరి క్షణం వరకు పేదలకు సేవ చేయడానికే అంకితం చేశారు. లక్షలాది మందిని తన మార్గంలో అనుసరించేందుకు కారణం అయ్యారు. 1950 అక్టోబర్ 7వ తేదీన కోల్ కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ పేరుతో రోమన్ క్యాథలిక్ రిలిజీయస్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశారు. మదర్ థెరిసా (Mother Teresa) ఎప్పుడూ పేదల గురించే ఆలోచించేవారు. వారికి సేవ చేసేందుకు తపించేవారు. పెళ్లి చేసుకోకుండా.. కుటుంబం లేకుండా.. సేవా ధృక్పథంతో తన జీవితాన్ని అంకితం చేశారు. 1979లో ప్రతిష్టాత్మక నోబెల్ అవార్డును స్వీకరించారు.
అంజేజ్ అంటే పువ్వు
మాసిడోనియాలో గల స్కోప్జేలో 1910 ఆగస్ట్ 26వ తేదీన మదర్ థెరిసా (Mother Teresa). జన్మించారు. మదర్ థెరిసా (Mother Teresa) అసలు పేరు అంజెస్ గోంక్షే బోజాక్షియు.. అల్బేనియన్ భాసలో అంజేజ్ అంటే పువ్వు అని అర్థం.. పుష్పం మాదిరిగా నిరుపేదల బాగోగుల కోసం తన జీవితాన్ని ధారపోశారు. యుక్త వయస్సులో.. అంటే 18 ఏళ్ల వయస్సులోనే తన జీవితాన్ని సేవ చేయాలని నిర్ణయం తీసుకొని, ముందుకు నడిచారు. అలా ఇండియాకు వచ్చి.. కోల్ కతాలో గడిపారు. పేదల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇలా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. భారత పౌరసత్వం తీసుకున్నారు.
భరోసా కల్పించి
తన అవసరం ఉన్నవారి కోసం సాయం చేయడం, అనారోగ్యంతో ఉన్న వారి బాగోగులు చూడటం. తల్లి, తండ్రి లేని వారిని చెరదీసి పెంచారు. అలా వారికి ఆశ్రయం కల్పించి ఆహారం, నీరు, వసతి కల్పించారు. సమస్య ఏంటీ.. ఏం చేస్తారు అని జీవితంలో భరోసా కల్పించారు. తన వద్ద ఉండే ప్రతీ ఒక్కరి పట్ల ఆమె ప్రేమను పంచి.. సంరక్షురాలిగా ఉన్నారు. మదర్ థెరిసా (Mother Teresa) సేవా గుణాన్ని యావత్ జాతి కీర్తించింది. ఆమె జయంతి రోజున ఉమెన్స్ ఈక్వాలిటీ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓ మహిళ అయి ఉండి.. సేవా ధృక్పథంతో తన జీవితాన్ని త్యాగం చేశారు. పెళ్లి చేసుకోకుండా.. అభాగ్యుల కోసం సేవ చేశారు. మదర్ థెరిసా చేసిన సేవలకు గానూ పలు అవార్డులు, రివార్డులు వరించాయి. ఓ మహిళ అయి ఉండి.. సర్వీస్ చేయడంతో ఈ రోజున మహిళా సమానత్వ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
మదర్ థెరిసా జయంతి సందర్భంగా కొన్ని కోట్స్
ప్రశాంతత అనేది చిరునవ్వుతో ప్రారంభం అవుతుంది.
మనందరం గొప్ప పనులు చేయలేం.. అచంచలమైన ప్రేమతో చిన్నవి చేయవచ్చు.
ప్రజల గురించి చెబుతారు.. కానీ వారిని ప్రేమించే సమయం మాత్రం లేదు.
దయతో మాట్లాడగలం.. కానీ నిజానికి చేతల్లో కరుణ చూపించరు.
మీరు వెళ్లినా ప్రతీ చోట ప్రేమను పంచండి, తిరిగి అంతే ప్రేమను పొందుతారు.
మీరు నాయకుల కోసం ఎదురు చూడొద్దు.. ఒంటరిగా.. ఒకరి నుంచి మరొకరు పనులు చేసుకోగలరు.