»Pm Modi Declared August 23 As A National Space Day And Chandrayaan 3 Landing Place Named As Shiv Shakti
Chandrayaan3: దిగిన ప్రాంతానికి దేవుడి పేరు..అంతేకాదు
చంద్రునిపై ప్రయోగించిన చంద్రయాన్-3 విజయం ప్రపంచానికే స్పూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సందర్భంగా బెంగళూరు చేరుకున్న మోడీ..ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. అంతేకాదు చంద్రయాన్ 3 రాకెట్ దిగిన ప్రాంతానికి ప్రత్యేక పేరు పెట్టారు.
PM Modi declared August 23 as a National Space Day and Chandrayaan 3 landing place named as Shiv Shakti
Narendra Modi: భారదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన చంద్రయాన్-3(Chandrayaan3 ) విజయాన్ని ఇస్రో శాస్త్రవేత్తల(ISRO scientists )తో పంచుకోవాలని ఎంతో ఆత్రంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాలను పర్యటించిన మోడీ నేరుగా శనివారం తెల్లవారుజామున బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మోడీ రాకతో స్థానికులు పెద్ద మొత్తంలో హాజరై జై విజ్ఙాన్ జై అనుసంధాన్(Jai Vigyan Jai Anusandhan) అనే నినాదాలతో హోరెత్తించారు. ప్రసంగానికి ముందు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ రోవర్ ప్రజ్ఞాన్, ల్యాండర్ విక్రమ్ గురించి పూర్తి వివరాలను పీఎంకు వివరించారు. చంద్రయాన్-3 విజయంలో శాస్త్రవేత్తలను ఉద్దేశేంచి మోడీ ప్రసంగించారు.
ఇస్రో సాధించిన విజయం దేశానికే గర్వకారణమని, చంద్రయాన్-3 విజయంతో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని మోడీ అన్నారు. ఇది మాములు విజయం కాదని భారత్ సత్తా ఏంటో ఇస్రో ప్రపంచానికి చూపించిందని, చంద్రుడుపై భారత్ అడుగుపెట్టడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. అయితే చంద్రయాన్ 3 దిగిన ప్రదేశానికి శివశక్తి(ShivShakti) అనే పేరును మోడీ ప్రతిపాదించారు. అలాగే చంద్రయాన్-2 దిగిన ఏరియాను తిరంగా(Tiranga)గా నామకరణం చేశారు. దీంతోపాటు ఆగస్టు 23ను జాతీయ స్పేస్ దినోత్సవం(National Space Day)గా ప్రకటించారు. ఇంకా మోడీ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ దూసుకుపోతుందని, ప్రపంచానికి వెలుగులు విరజిమ్ముతోందన్నారు. భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచమంతా కీర్తిస్తుందని, అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించి, దేశాన్ని ఉన్నత శిఖరాలలో నిలబెట్టారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలు ఎవరు సాధించలేని విజయాన్ని సాధించారని వారికి సెల్యూట్ చేశారు.
Interacting with our @isro scientists in Bengaluru. The success of Chandrayaan-3 mission is an extraordinary moment in the history of India's space programme. https://t.co/PHUY3DQuzb