»Modi Govt Release Pm Kisan Samman Nidhi 17th Installment Today
PM-Kisan 17th installment: 17వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ
PM-Kisan 17th installment: వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులకు మొదటి పెద్ద బహుమతిని అందించింది.
PM-Kisan 17th installment: వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులకు మొదటి పెద్ద బహుమతిని అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడతను విడుదల చేశారు. దీని కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.2000 విడతగా పంపారు. మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోదీ సంతకం చేసిన మొదటి ఫైల్ ‘ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ 17వ విడత విడుదలకు సంబంధించినది.
పథకం వివరాలు
పీఎం కిసాన్ అనేది 2019 సంవత్సరంలో ప్రారంభించబడిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) కార్యక్రమం. దీని కింద లబ్ధిదారుడైన రైతులకు వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6,000 అందజేస్తారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా రైతులకు కేంద్రం రూ.3 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నమోదు ప్రక్రియ సులభం. మీరు ఆన్లైన్ అధికారిక పోర్టల్ http://pmkisan.gov.inని సందర్శించడం ద్వారా మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవచ్చు. రైతులు పీఎం కిసాన్ కింద నమోదు కోసం రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన స్థానిక పట్వారీ/రెవెన్యూ అధికారి/నోడల్ అధికారిని కూడా సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్లో కిసాన్ కార్నర్, సీఎస్సీ, మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవడానికి ప్రత్యేక సౌకర్యాలు ప్రారంభించారు.