110 years imprisonment for a person who cheated in the name of jobs
punishment: ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎదో ఒక రోజు చట్టపరంగా శిక్ష(punishment) పడుతుంది. అతను చేసిన నేరాన్ని బట్టి కోర్టు పనిష్మెంట్ ఖారారు చేస్తుంది. అందులో జీవిత ఖైదీ (life prisoner), మరణశిక్ష(death penalty) అనేవి చాలా పెద్దవి. కానీ ఇతనికి పడిన శిక్ష అంతకన్న పెద్దదేమో అనిపిస్తుంది. 110 ఏళ్ల శిక్ష పడింది మరి. మాములుగా మనిషి సగటు జీవిత కాలం 60 నుంచి 70 ఏళ్లు.. అతనికి పడిన శిక్ష అంతకు మించి ఉంది.
హైకోర్టులో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తికి జబల్పూర్ (Jabalpur) సెషన్స్ కోర్టు 110 ఏళ్ల కారాగారం విధించింది. పురుషోత్తమ్ పాసి అనే వ్యక్తి మధ్యప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని 100 మంది నుంచి రూ.5 వేల నుంచి రూ.30 వేల చొప్పున వసూలు చేశాడు. మధ్యప్రదేశ్ హైకోర్టు పేరుతో నకిలీ (fake) అపాయింట్మెంట్ (Appointment) లెటర్లను ఇచ్చాడు. అవి నకిలీవి అని తేలడంతో బాధితులు పురుషోత్తంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మోసం చేశాడని 15 కేసులు నమోదయ్యాయి. కేసు విచారణతో పురుషోత్తంను దోషిగా తేలుస్తూ జబల్పూర్ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. పలు సెక్షన్ల కింద ప్రతి కేసులో ఎనిమిదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.15వేలు జరిమానా కూడా విధించారు. 100 మంది నుంచి డబ్బులు వసూలు చేసిన పురుషోత్తం ఓ మహిళా స్నేహితురాలి సాయంతో హైకోర్టు పేరుతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్లను తయారుచేసినట్లు విచారణలో వెల్లడైంది. తరువాత వాటిని తీసుకొని బాధితులు ఉద్యోగంలో చేరడానికి మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్లగా అవి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లని తెేలింది. దీంతో వారు కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో పురుషోత్తమ్కు కోర్టు 110 ఏళ్ల జైలు శిక్ష విధించింది.