Man Complains Of Stomach Pain For Years, Doctors Find This Inside His Body
Stomach Pain: పంజాబ్లో గల మోగాలో మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు 40 ఏళ్ల రోగికి ఆపరేషన్ చేస్తూ షాక్కు గురయ్యారు. ఎందుకంటే అతని కడుపులో ఒకటి రెండు కాదు దాదాపు వంద వస్తువులు దొరికాయి. కడుపులో పిన్స్, ఇయర్ఫోన్లు, లాకెట్లు, స్క్రూలు , రాఖీలతో సహా వింత వస్తువులు వందకుపైగా ఉన్నాయి. రోగి తీవ్రమైన జ్వరం విపరీతమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజులుగా విపరీతమైన వికారం, కడుపులో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో డాక్టర్ ఎక్స్రే పరీక్షలు చేశారు. ఫలితాలు రాగానే వైద్యుల బృందం షాక్కు గురైంది.
X- రే ఫలితాలు మనిషి కడుపు లోపల చాలా వస్తువులు గుర్తించాయి. ఆ వస్తువులను తొలగించడానికి మూడు సంవత్సరాలు పట్టింది. పొట్ట నుంచి వంద వస్తువులలో ఇయర్ఫోన్లు, వాషర్లు, నట్స్ , బోల్ట్, వైర్లు, రాఖీ, లాకెట్, బటన్, రేపర్ , సేఫ్టీ పిన్ కూడా ఉన్నాయి. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కల్రా మాట్లాడుతూ, ” అనేక సంవత్సరాల వైద్య అనుభవంలో ఈ వింత కేసు మొదటిది, రోగి రెండేళ్లుగా కడుపు సమస్యలతో బాధపడుతున్నాడు. ఆపరేషన్ చేసినప్పటికీ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. ఇది మరిన్ని అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు అని తెలిపారు.
అతను పొట్టలో ఇన్ని వస్తువులు ఉన్నాయని తెలిసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. రోగి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, కడుపునొప్పి, నిద్రలేమితో తరచూ అడ్మిట్ అవుతున్నాడని తెలిపారు.