»Doctor Left The Surgery In Jhansi For Eating Masala Dosa
DOCTOR : దోశ కోసం ఆపరేషన్ మధ్యలో వదిలేసి రెండు గంటల తర్వాత తిరిగొచ్చిన డాక్టర్
ఆకలేస్తుంది మసాలా దోశ తిని వస్తానని చెప్పి ఓ డాక్టర్ ఆపరేషన్ మధ్యలో బయటకు వెళ్లిపోయాడు. చివరికి రెండు గంటల తర్వాత తిరిగి వచ్చి హడావిడిగా దాన్ని పూర్తి చేశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DOCTOR LEFT THE SURGERY IN JHANSI : ఓ బాలిక ప్రమాద వశాత్తూ కింద పడిపోవడంతో ఎడమ మోచేతి ఎముక విరిగిపోయింది. దీంతో ఎమర్జన్సీగా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. బాలికను ఆపరేషన్ థియేటర్లోకి(OPERATION THEATER) తీసుకెళ్లారు. ఆపరేషన్ మొదలు పెట్టారు. అది చేస్తున్న వైద్యుడు(DOCTOR) ఉన్నట్లుండి తనకు ఆకలి వేస్తోందని, మసాలా దోశ(MASALA DOSA) తిని వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రెండు గంటల వరకు తిరిగి రాలేదు. ఆ తర్వాత వచ్చి హడావిడిగా ఆపరేషన్ పూర్తి చేశాడు. ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆమె మోచేయి ఎముక సెట్ కాలేదు. దీంతో ఆ డాక్టర్ని కలవడానికి ప్రయత్నిస్తే ఆయన నిరాకరించాడు.
ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్లోని ఝాన్సీలో(JHANSI) చోటు చేసుకుంది. అక్కడి నవాబాద్ ప్రాంతంలో ఉంటున్న కాజల్ శర్మ విషయంలో జరిగిన దారుణమిది. దీంతో ఆమె ఈ విషయమై ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి దర్యాప్తూ చేయలేదు. తర్వాత ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. దీంతో ఆమె నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరింది.
ఆపరేషన్ జరిగినంత సేపు తాను మెలుకువగా ఉండి అన్నీ చూశానని, తన చేయి మాత్రమే మొద్దుబారిపోయి ఉందని కాజల్ తెలిపింది. ఆపరేషన్(SURGERY) తర్వాత అంతా నయం అయిపోతుందని చెప్పారని, అలా కాదు సరికదా.. తన చేతి వేళ్లు కూడా వంకర్లు పోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.