KTR On Modi : సర్టిఫికేట్స్ వ్యవహారం…. కేటీఆర్ షాకింగ్ ట్వీట్..!
KTR On Modi : ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివాదం పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు పై ఆయన స్పందించారు.
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ పై పెద్ద చర్చే జరుగుతోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ విషయం మొదట స్పందించగా… ఇప్పుడు ఈ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రతి పక్షాలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మోదీ సర్టిఫికెట్ వివరాలు కావాలని అడిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కోర్టు రూ. 25 వేల జరిమానా కూడా విధించింది. మరోవైపు, ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించి బిజెపిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధించారు.
బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైపు వ్యక్తులు చాలా మందే ఉన్నట్టున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలవి ఫేక్ సర్టిఫికెట్లని చెప్పారు. రాజస్థాన్, తమిళనాడు యూనివర్శిటీల్లో చదివినట్టు వారి వద్ద తప్పుడు సర్టిఫికెట్లు ఉన్నాయని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం నేరం కాదా? అని ప్రశ్నించారు. లోక్ సభ స్పీకర్ వీటిని పరిశీలించి ఆ ఇద్దరు ఎంపీలపై అనర్హత వేటు వేయగలరా? అని ప్రశ్నించారు.