రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతోంది. ఆయన జోడో యాత్రకు మంచి స్పందన వస్తోంది. ఆయన యాత్రకు కాంగ్రెస్ నేతలు, ప్రజలతో పాటు సెలబ్రెటీలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ శ్రీరాముడితో పోల్చారు. రాహుల్ గాంధీని శ్రీరాముడితో పోల్చడంతో బీజేపీ నేతలు పైర్ అవుతున్నారు. హిందూవుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా సల్మాన్ ఖుర్షీద్ వ్యవహరించాలరని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే, ఖుర్షీద్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకోవడంతో పాటు, ఎదురుదాడికి దిగారు. రాహుల్ గాంధీ ఎముకలు కొరికే చలిలో సైతం టీషర్ట్ వేసుకొని యోగిలా యాత్ర చేస్తున్నారని, కఠోర దీక్షకు ఇదోక నిదర్శనమని, శ్రీరాముడు దేశంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించారు. శ్రీరాముడు పర్యటించలేని ప్రాంతాలలో భరతుడు ఆయన పాదుకలను తీసుకొని వెళ్లారు. ఆ విధంగా కూడా శ్రీరాముడు ఆ ప్రాంతాలను పర్యటించినట్లే నని, రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్లో నేరుగా రాహుల్ గాంధీ పర్యటించకపోయినా ఆయన పాదుకలను ఉత్తర ప్రదేశ్ తీసుకొచ్చామని, పాదుకలు వచ్చాయి కాబట్టి రాముడు సైతం ఉత్తర ప్రదేశ్కు వస్తారని విలేఖరులకు తెలిపారు.
దీనిపై బీజేపీ విమర్శలు చేయగా, ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. దేవుడు చూపిన బాటలో నడుస్తున్నారనే విధంగా తాను వ్యాఖ్యలు చేశానని, కాని, బీజేపీ నేతలు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, బీజేపీలో మంచివాళ్లు లేకపోబట్టే ఇలా అర్ధం చేసుకుంటున్నారని సల్మాన్ ఎదురుదాడి చేశారు.