»Isi Funding Amritpal Singh To Promote Him As Bhindranwale 2 0 Security Agencies Suspect
ISI fund to Amritpal Singh:అమృత్ పాల్ సింగ్‌కు ఐఎస్ఐ నిధులు, నిఘా సంస్థల అనుమానం
ISI fund to Amritpal Singh:ఖలిస్థాన్ నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు పాకిస్థాన్ ఐఎస్ఐ నిధులు సమకూరుస్తోందని భారత నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. అమృత్ పాల్‌ను ఐఎస్ఐ బ్రిందాన్వాలె 0.2గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని విశ్వసనీయంగా తెలిసింది. జర్నాలీ సింగ్ బ్రిందాన్ వాలె సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఖలిస్థాన్ కావాలని పోరాడారు.
ISI funding Amritpal Singh to promote him as Bhindranwale 2.0 security agencies suspect
ISI fund to Amritpal Singh:ఖలిస్థాన్ నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు (Amritpal Singh) పాకిస్థాన్ ఐఎస్ఐ (isi) నిధులు సమకూరుస్తోందని భారత నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. అమృత్ పాల్‌ను (Amritpal Singh) ఐఎస్ఐ బ్రిందాన్వాలె 0.2గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని సమాచారం అందింది. జర్నాలీ సింగ్ బ్రిందాన్ వాలె సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఖలిస్థాన్ కావాలని పోరాడారు. 1984లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో (operation blue star) చనిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమృత్ పాల్ సింగ్‌ను బ్రిందన్ వాలె 0.2గా ప్రమోట్ చేస్తోందని. . అందుకోసం నిధులు అందజేస్తోందని సమాచారం.
చదవండి:74 medicine retail price finalise:74 మందుల రిటైల్ ధర ఖరారు
ఇటీవల అజ్నాలాలో అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) అనుచరుడు లవర్ ప్రీత్ సింగ్ తుపాన్, (lover preeth singh) పంజాబ్ పోలీసులు (punjab police) మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అతని మద్దతు దారులు కత్తులు, తుపాకులు తీసుకొని పోలీసు బారికేడ్లను చేదించి మరీ అజ్నాలా (ajnala) పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. పోలీసులు తమను ఏమీ చేయొద్దని గురు గ్రంథ్ సాహిబ్‌ను (guru granth sahib) అడ్డు పెట్టుకున్నారని పోలీసులు తెలిపారు. అది వారి పవిత్ర గ్రంథం కావడంతో.. పోలీసులు తమను ఏమీ చేయరని రెచ్చిపోయారని చెబుతున్నారు. గొడవ నేపథ్యంలో లవర్ ప్రీత్ తుఫాన్‌ను (lover preeth singh) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాతే అమృత్ పాల్ సింగ్‌కు (Amritpal Singh) ఉగ్రవాద సంస్థ నుంచి నిధులు సమకూరాయని తెలిసింది.
చదవండి:Surf Excel సేల్స్ అదుర్స్.. బిలియన్ డాలర్ల విక్రయాలతో టాప్ ప్లేస్
అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh), అతని అనుచరులతో పోలీసులు (police) చర్చలు జరిపారు. ఆ తర్వాత లవ్ ప్రీత్ సింగ్‌ను (lover preeth singh) విడుదల చేయాలని పంజాబ్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ (congress), దమ్‌దామీ తత్సల్ ఖండించాయి. అజ్నాలా ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇటు అజ్నాలా (ajnala) పోలీస్ స్టేషన్ వద్దకు గురుగ్రంథ్ సాహిబ్ (guru granth sahib) తీసుకొచ్చారా అనే విషయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ కమిటీని కూడా నియమించింది. పంజాబ్‌లో (punjab) ఉగ్రవాదం వ్యాప్తికి, మత సామరస్యం దెబ్బతీసేందుకు ఐఎస్ఐ ఖలిస్థాన్ ఉగ్రవాద గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది.