»Nijjar Ran Arms Training Camps In Canada Funded Attacks In India
Indiaపై దాడి చేసేందుకు ఆయుధ శిక్షణ శిబిరాల నిర్వహణ
హర్దీప్ సింగ్ నిజ్జర్‌కు భారత్ అంతే గిట్టదు. ఇండియా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడమే అతని పని. కెనడాలో ట్రక్ డ్రైవర్, ప్లంబర్‌గా పనిచేస్తూనే.. భారత్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. నిధులను సమకూర్చుకొని, కొందరికీ శిక్షణ కూడా ఇచ్చాడు.
Nijjar Ran Arms Training Camps In Canada, Funded Attacks In India
Nijjar: ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ (Nijjar) హత్య తర్వాత ఇండియా- కెనడా మధ్య దౌత్యపర సంబంధాలు దిగజారాయి. నిజ్జర్ ఏం దేశభక్తుడు కాదని భారత నిఘా వర్గాలు అంటున్నాయి. కెనడా పౌరసత్వం తీసుకున్న నిజ్జర్.. అక్కడ ఆయుధాలతో శిక్షణ కేంద్రం నిర్వహించాడని పేర్కొంది. భారత్ మీద దాడులు చేసేందుకు నగదు సమకూర్చారని వివరించింది.
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సాయంతో నిజ్జర్ శిక్షణ పొందాడని చెబుతోంది. ఖలిస్థానీ నేతలతో సంబంధాలు కొనసాగించాడని వివరించింది. పంజాబ్.. దేశంలో గల ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు నిధులు సమకూర్చాడని ప్రకటించింది. కెనడాలో శిక్షణ శిబిరాలను నిర్వహించాడని.. ఏకే 47, స్నిపర్ రైఫిల్స్, పిస్టల్స్ ఉపయోగించి ట్రైనింగ్ ఇచ్చాడని తెలిపింది.
కెనడా నుంచి కొందరినీ ఇండియా కూడా పంపించారని.. రాజకీయ, మతపరంగా ప్రముఖ వ్యక్తులను హత్య చేసేందుకు లేదంటే దాడులు చేసే బాధ్యతలు అప్పగించారని వివరించింది. నిజ్జర్ ఫేక్ పాస్ పోర్ట్‌తో 1996లో కెనడా వెళ్లారు. తన పేరును రవి శర్మగా చెప్పుకున్నాడు. ట్రక్ డ్రైవర్, ఫ్లంబర్ పని చేస్తూనే.. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. భారత దౌత్యవేత్తలను బెదిరింపులకు దిగాడు. కెనడాలో స్థానిక గురుద్వారాలు నిర్వహించే కార్యక్రమాలకు భారత రాయబార కార్యాలయ అధికారులు రాకుండా నిషేధించాలని పిలుపునిచ్చారు.
నిజ్జర్ 1996లో కెనడా రాగా.. ఆ మరుసటి ఏడాది ఓ మహిళ వచ్చారు. ఆమెను పెళ్లి చేసుకున్నానని చెప్పారు. 1997లో కెనడా వచ్చిన ఆ మహిళ మరొకరిని పెళ్లి చేసుకుంది. ఇదే అంశంపై 2001 ఏడాదిలో నిజ్జర్ కోర్టులో సవాల్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2007లో నిజ్జర్‌కు కెనడా పౌరసత్వం వచ్చింది. ఆ తర్వాత అతను భారత్ వ్యతిరేక కార్యకలాపాలను మరింత పెంచాడు.