»Fci With Central Decision 145 Crore People Are Suffering From Hunger
FCI: కేంద్ర నిర్ణయంతో.. 145 కోట్ల మందికి ఆకలిబాధలు.!
కేంద్రం నిర్ణయంతో దేశంలో ఆకలి బాధలు పెరుగనున్నాయి. బియ్యం కొరత ఉందని చెప్పడంతో మార్కెట్ లో రేట్లు పెరుగుతున్నాయి. తెలంగాణ మిల్లుల్లో ఉన్న బియ్యం తీసుకోండి అంటే గోదాములు ఖాళీగా లేవు అంటుంది.
With central decision.. 145 crore people are suffering from hunger
FCI: బియ్యం(Rice) నిల్వల విషయంలో కేంద్రప్రభుత్వం వైఖరి చాలా వింతగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ముందుకొస్తున్నా వద్దంటూ 145 కోట్ల మంది ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. మోదీ సర్కారు నిర్ణయాలతో ఇప్పటికే నిత్యావసరాలు(Necessities), కమోడిటీస్(Commodities) ధరలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా బియ్యం ధరలు కూడా పెరుగుతున్నాయి. ధరల నియంత్రణ పేరుతో ఎగుమతులపై నిషేధం విధించినా పరిస్థితిలో మార్పేమీ రాలేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దేశంలో బియ్కం కొరత ఉన్నదని ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. అయినా బియ్యం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో బహిరంగ మార్కెట్లోకి భారీగా బియ్యాన్ని సరఫరా చేయాలి. కానీ కేంద్రం మాత్రం ఇలా చేయడం లేదు. తెలంగాణ మిల్లుల్లో సుమారు 1.10 కోట్ల టన్నుల ధాన్యం ఉంది. ఈ ధాన్యాన్ని మరాడించి ఇస్తాం తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా.. కేంద్రం అందుకు విముఖత చూపుతుంది. ఎఫ్‌సీఐ గోదాములు ఖాళీగా లేవంటూ మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోవడం లేదు.
కొరత ఉంటే గోదాములు అన్ని ఖాలీగా ఉండాలి కదా.. అంటే దీని వెనుక కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. గత నెల వరకు రాష్ట్రం నుంచి ప్రతిరోజు రైళ్ల ద్వారా సుమారు 200 ర్యాక్‌లను తరలించిన ఎఫ్‌సీఐ, ఈ నెల 90 ర్యాక్‌లను మాత్రమే తరలించినట్టు తెలిసింది. దీంతో గోదాములు ఖాళీ కావడం లేదు. ఈ సాకుతో మిల్లర్ల నుంచి బియ్యం తీసుకొనేందుకు ఎఫ్‌సీఐ నిరాకిస్తుస్తున్నది. ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్ర మిల్లింగ్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. గత సీజన్ ధాన్యమే మిల్లుల్లో పేరుకుపోయింది. మరో నాలుగైదు నెలల్లో కొత్త ధాన్యం భారీగా వస్తుంది. ఆ ధాన్యాన్ని ఎక్కడ నిల్వచేయాలనే ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలంటే బియ్యం సేకరణను ఎఫ్‌సీఐ వేగవంతం చేయాలని పరిశ్రమవర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఫోర్టిఫైడ్ రైస్ విషయంలోనూ ఎఫ్‌సీఐ రాజకీయం చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం నుంచి సీఎమ్మార్ (బియ్యం) సేకరణలో భాగంగా మిల్లర్లు ఇస్తున్న ఫోర్టిఫైడ్ రైస్‌లోని ఫోర్టిఫైడ్ కెర్నల్స్ నాణ్యత సరిగ్గా లేదంటూ బియ్యం తీసుకునేందుకు ఎఫ్‌సీఐ నిరాకరిస్తున్నది. గోదాములకు చేరిన బియ్యాన్ని వెనక్కి పంపింది. ఇప్పటివరకు సుమారు 308 మిల్లుకు సంబంధించి 2 వేల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌ను ఎఫ్‌సీఐ తిరస్కరించింది. దీంతో మిల్లింగ్ ఇండస్ట్రీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో విటమిన్-బీ, ఐరన్, ఫోరిక్ యాసిడ్ మిశ్రమం గల బలవర్ధక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్)ను గత ఏప్రిల్ నుంచి ప్రజా పంపిణీలో భాగంగా ప్రజలకు అందిస్తున్నది.
బియ్యంలో కలిపే ఫోర్టిఫైడ్ కెర్నల్స్(Fortified kernels)ను రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలే సరఫరా చేస్తున్నాయి. ఎఫ్‌సీఐ(FCI) నిబంధనల ప్రకారం నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ (నాఫెడ్), నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్సీసీఎఫ్) సంస్థలు పౌరసరఫరాల సంస్థకు ఫోర్టిఫైడ్ కెర్నల్స్ సరఫరా చేస్తున్నాయి. దీని ప్రకారం ఫోర్టిఫైడ్ కెర్నల్స్‌లో నాణ్యత లేకపోతే ఆ తప్పు వాటిని సరఫరా చేసిన నాఫెడ్, ఎన్సీసీఎఫ్దే అవుతుంది. ఎఫ్‌సీఐ మాత్రం ఆ తప్పును మిల్లర్లపై, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థపై నెట్టేస్తున్నది. ఎఫ్‌సీఐ తీరుపై రాష్ట్ర అధికారులు, మిల్లర్లు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు సరఫరా చేసిన కెర్నల్స్ నాణ్యత లేకుంటే, దానికి తామెందుకు బాధ్యత వహించాలని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ సోమవారం ఎఫ్‌సీఐకి లేఖ రాయనున్నారు. తిరస్కరించిన బియ్యాన్ని తీసుకోవాలని కోరనున్నారు. ఎఫ్‌సీఐ నుంచి సానుకూల స్పందన రాకపోతే 26న ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది.