Plane crashed at Port Sudan airport... 9 people died
Plane Crash: ఎర్ర సముద్ర రాష్ట్రంలోని పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో ఓ విమానం కుప్పకూలిపోయిన సంఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన విమానం సాంకేతిక లోపం కారణంగా కాసేపటికే కూలిపోయింది. ఈ పౌర విమానంలో(Plane Crashes) మొత్తం నలుగురు సైనిక సిబ్బందితో సహా 9మంది మరణించారు. అయితే ఈ ప్రమాదంలో ఒక ఆడ శిశువు ప్రాణాలతో బయటపడిందని సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆంటోనోవ్ విమానం కూలిపోవడానికి ముందు గాల్లో ఎగిరింది, ఎవరు ఊహించని విధంగా సంకేతికత విఫలమై కూలిపోయింది. పోర్ట్ సుడాన్ (Port Sudan airport) విమానాశ్రయంలో ఆంటోనోవ్ విమానం కూలిపోవడానికి కారణం టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం అని సుడాన్ ఆర్మీ ప్రతినిధి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. సూడాన్ ఏప్రిల్ 15వతేదీ నుంచి రాజధాని ఖార్టూమ్, ఇతర ప్రాంతాల్లో సూడాన్ సైన్యం(Sudan Army), పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(Paramilitary Rapid Support Forces) మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఖార్టూమ్‌కు తూర్పున 890 కి.మీ దూరంలో ఉన్న పోర్ట్ సుడాన్ విమానాశ్రయం, పోరాడుతున్న పార్టీల మధ్య సాయుధ ఘర్షణల కారణంగా ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేవలను నిలిపివేశారు. ఆ తర్వాత పోర్ట్ సుడాన్ విమానాశ్రయాన్ని దేశంలోని ప్రధాన విమానాశ్రయంగా ఉపయోగిస్తున్నారు.