»Delhi Bus Driver Not Halting For Women Passengers Cm Arvindd Kejriwal Serious
Bus Stopలో మహిళలను చూసి ఆపని బస్సు.. ఊడిన డ్రైవర్ ఉద్యోగం
మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించాం. ఇది అమల్లోకి వచ్చాక మహిళలను బస్సుల్లో ఎక్కించుకునేందుకు కొందరు డ్రైవర్లు నిరాకరిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.
గతంలో ప్రతి బస్సుపై ‘చేయి చూపితే బస్సు ఆపబడును’ అనే నోటీస్ ఉండేది. మార్గమధ్యలో ప్రయాణికులు కనిపిస్తే బస్సు నిలపాలని ఆర్టీసీ డ్రైవర్లకు (RTC Driver) ఒక నియమం ఉండేది. కానీ ఆ నియమాన్ని కొందరు విస్మరిస్తున్నారు. ఇలాగే ఓ డ్రైవర్ విస్మరించడంతో అతడి ఉద్యోగం ఊడిపోయింది. బస్టాప్ (Bus Stop) వేచి చూస్తున్న మహిళల కోసం బస్సు ఆపకపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం సంబంధిత డ్రైవర్ ను తొలగించింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించింది. అయితే ఉచితంగా ప్రయాణం చేస్తున్నారనే ఉద్దేశంతో మహిళలను ఎక్కించుకోవడానికి డ్రైవర్లు అంగీకరించడం లేదు. కొన్ని చోట్ల బస్సులను ఆపకుండా వెళ్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో (Video) కనిపించింది. ఆ వీడియోను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) చూశారు. ఆ వీడియోను తన ట్విటర్ (Twitter)లో పోస్టు చేశారు. ‘మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించాం. ఇది అమల్లోకి వచ్చాక మహిళలను బస్సుల్లో ఎక్కించుకునేందుకు కొందరు డ్రైవర్లు నిరాకరిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి డ్రైవర్లపై తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని కేజ్రీవాల్ రాశారు. ఆ వీడియోలో మహిళలు బస్సు ఎక్కేందుకు వస్తుండగా డ్రైవర్ బస్టాప్ లో ఆపకుండా వెళ్తున్నాడు.
ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ (Kailash Gahlot) వెంటనే స్పందించారు. సంబంధిత డ్రైవర్ ను గుర్తించాలని అతడిపై కఠిన చర్యలు (Action) తీసుకుంటామని మంత్రి తెలిపారు. అన్నట్టుగా ఆ డ్రైవర్ ను విధుల్లో నుంచి తొలగించినట్లు సమాచారం.
ऐसी शिकायतें आ रही हैं कि कुछ ड्राइवर महिलाओं को देखकर बस नहीं रोकते क्योंकि महिलाओं का सफ़र फ़्री है। इसे बिल्कुल बर्दाश्त नहीं किया जाएगा। इस बस ड्राइवर के ख़िलाफ़ सख़्त एक्शन लिया जा रहा है। pic.twitter.com/oqbzgMDoOB