సందేహాం ఉన్న లింకులపై క్లిక్ (click) చేయొద్దని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కోరింది. మీ మొబైల్లో సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఉన్న ఏం లాభం ఉండదని వివరించింది. రాన్ సమ్‌వేర్ డెవలప్ చేసుకునే సామర్థ్యం మాల్ వేర్‌కు ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. దామ్ (Daam) మాల్ వేర్ ఇన్ స్టాల్ అయితే మొబైల్ సెక్యూరిటీ వ్యవస్థను మభ్యపెడుతుంది. డేటాను మెల్లిగా చోరీ చేస్తోంది. ఓ సారి ట్రై చేశాక.. సక్సెస్ అయితే చాలు మొబైల్లోని రీడింగ్ హిస్టరీ, బుక్ మార్క్స్ తదితర కీలక సమాచారాన్ని దొంగిలిస్తోంది.
బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్‌ను (process) కూడా నిలిపేస్తోంది. కాల్ డేటాను (call data) హ్యాక్ చేస్తోందని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ పేర్కొంది. ఇన్ఫర్మేషన్ (information) మొత్తం తీసుకున్న తర్వాత ఫార్మాట్ ఎన్ క్రిప్ట్ చేసుకొని.. ఒరిజినల్ డేటా కూడా డిలీట్ చేస్తుందని తెలిపింది. దామ్ (Daam) మాల్ వేర్ బారిన పడకుండా ఉండాలంటే సస్పెక్ట్ యూఆర్ఎల్స్ (url) క్లిక్ చేయొద్దని సూచించింది. అపరిచిత వ్యక్తులు మెసేజ్ చేస్తే స్పందించొద్దని చెప్పింది. సో.. మొబైల్ చక్కగా వాడండి.. అంతే తప్ప, అన్నీ లింకులను ఓపెన్ చేయద్దు.. ఓ సారి లింక్ ఓపెన్ చేశారో ఇక అంతే సంగతులు.