»Church Father Church Father Who Wore Ayyappa Mala License Canceled For Being Against Religion
Church Father: అయ్యప్ప మాల వేసుకున్న చర్చి ఫాదర్..మత విరుద్ధమని లైసెన్స్ రద్దు!
ఓ చర్చి ఫాదర్ అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆయన అయ్యప్పమాలను వేసుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్పమాల వేసుకున్న ఆయన ఫాదర్‌గా అనర్హుడని చర్చి సంస్థ ఆయనపై నిషేధం విధించింది.
ఏసుక్రీస్తును నమ్మే క్రైస్తవులు ఇతర మతాల దేవుళ్లను అస్సలు నమ్మరని అందరికీ తెలుసు. వారు విగ్రహారాధనను తప్పుగా బావిస్తుంటారు. అలాంటి ఓ క్రైస్తవుడు అయ్యప్పమాల ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. త్వరలో శబరిమలలో కొలువైన అయ్యప్పను దర్శించుకుంటానని 50 ఏళ్ల మనోజ్ తెలిపాడు. చర్చ ఫాదర్ (Christian pries) అయిన మనోజ్ ఇలా అయ్యప్పమాల వేయడంతో తన రెవరెండ్ లైసెన్స్ (Church licence)ను కూడా వదులుకున్నాడు.
కేరళలోని తిరువనంతపురానికి చెందిన రెవరెండ్ మనోజ్ కేజీ (Rev Manoj KG) అనే వ్యక్తి ఆంగ్లికన్ చర్చి ఆఫ్ ఇండియా (Anglican Church of India)లో ఫాదర్‌గా ఉంటూ బోదనలు చేస్తుండేవాడు. అయితే ఆయనకు ఇతర మతాల గురించి తెలుసుకునే ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందుకే ఆయన అయ్యప్పమాల ధరించారు. శబరిమల వచ్చి స్వామిని దర్శించుకుంటానని తెలిపారు. దీంతో మతపరమైన నియమాలు ఉల్లంఘించారని ఫాదర్ మనోజ్‌పై ఆంగ్లియన్ చర్చి ఆఫ్ ఇండియా సంస్థ నిషేధం విధించింది. ఆయన ఐడీ కార్డును క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించింది.
మనోజ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ 2010లో చర్చ్ లో ప్రార్థనలు చేసేవాడు. 2015లో ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి స్థాయి ఆధ్యాత్మికవేత్తగా మారగా 2022లో రెవరెండ్ స్థానాన్ని పొందడం విశేషం. జీతం కూడా తీసుకోకుండా మనోజ్ మత బోధనలు చేసేవారు. అయితే ఇప్పుడు అయ్యప్ప మాల ధరించడం వల్ల ఆయన లైసెన్స్ క్యాన్సిల్ అయ్యింది.