»Cheetah Gamini Her 5 Cubs Enjoy Rain At Kuno National Park
National Park : వర్షంలో ఆడుకుంటున్న విదేశీ చిరుతలు.. ఆకట్టుకుంటున్న మంత్రి పోస్ట్
కూనో నేషనల్ పార్క్లో వర్షంలో ఆడుకుంటున్న చిరుత పిల్లల వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Cubs Enjoy Rain At Kuno National Park : కూనో నేషనల్ పార్కులో విదేశీ చిరుతలు(Cheetahs) సందడి చేస్తున్నాయి. వాటి పిల్లలతో కలిసి వర్షంలో చక్కగా ఆడుకుంటే సరదాగా గడుపుతున్నాయి. ఈ అందమైన వీడియోని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దక్షిణాఫ్రికా నుంచి గామిని అనే చిరుతను గత మార్చిలో ఇక్కడికి రప్పించారు. దాన్ని మధ్యప్రదేశ్లోని కూనే నేషనల్ పార్క్లో ఉంచారు. అది ఇక్కడ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. రుతుపవనాల కారణంగా భారత దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాల్లో ఆ ఐదు చిరుత పిల్లలు చక్కగా ఆడుకుంటున్నాయి.
కేంద్ర మంత్రి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ గామిని చిరుతను(Cheetah Gamini) దక్షిణాఫ్రికాలోని కలహరి టైగర్ రిజర్వ్ నుంచి ఇండియాకి తెప్పించారు. ఇది భారత్ లో ప్రసవించిన తొలి దక్షిణాఫ్రికా చిరుతగా, నాలుగో విదేశీ చిరుతగా గుర్తింపు పొందించింది. ఇది ఈ ఏడాది మార్చి 10న కూనో నేషనల్ పార్కులో( Kuno National Park) ఈ ఐదు చిరుత పిల్లలకు జన్మనిచ్చింది. అవే ఇప్పుడు ఇలా వర్షాల్లో సరదాగా ఆడుకుంటూ కనిపించాయి. మన దేశంలో చిరుతల పునరుద్ధరణ ప్రాజెక్టు కింద దక్షిణాఫ్రికా, నమీబియా దేశాల నుంచి 20 చీతాలను తెప్పించారు. వాటిలో కొన్ని మృత్యువాత పడ్డాయి. మిగిలిన చీతాలు కొన్ని పిల్లల్ని కన్నాయి. దీంతో ఇప్పుడు వీటి సంతతి ఇక్కడ 26గా ఉంది. వాటిలోని పిల్లలే ఇప్పుడిలా వర్షాలకు సరదాగా ఆడుకుంటూ కనిపించాయి.