»Central Home Minister Amit Shah Participated In Telangana Liberation Day
Amit shah: తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర హో మంత్రి
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) హాజరయ్యారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) హైదరాబాద్ వార్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించి..పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి గౌరవ వందనం స్వీకరించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ చుట్టూ భారీగా CRPF బలగాలు మోహరించాయి. దీంతోపాటు ఆ ప్రాంతంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
అంతేకాదు ఈరోజు ఉదయం 8 గంటలలోపు హైదరాబాద్(hyderabad) రాచరిక రాష్ట్ర ప్రజలు అంటే తెలంగాణ ప్రజలకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ సంస్థాన ప్రజలందరికీ హైదరాబాద్ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. హైదరాబాద్ ప్రజలందరికీ హైదరాబాద్ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు హైదరాబాద్ రాష్ట్ర ప్రజల అచంచలమైన దేశభక్తికి, స్వాతంత్రం కోసం ప్రజల నిరంతర పోరాటానికి నిదర్శనమని పేర్కొన్నారు. నిజాం దుష్ట పాలన, అణచివేత నుంచి విముక్తి లభించిన రోజు అని పేర్కొన్నారు. హైదరాబాద్ విముక్తి పోరాటంలో వీరమరణం పొందిన వారందరికీ నా హృదయపూర్వక నివాళులు అర్పించారు. హైదరాబాద్ రాచరిక రాష్ట్రమైన హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేసిన రోజున ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అక్టోబర్ 20వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడించనున్నారు.