Breaking News: Bajrang Dal Workers Vandalized Congress Office In Jabalpur
Bajrang Dal Workers:కర్ణాటకలో అధికారంలోకి వస్తే పీఎఫ్ఐతోపాటు (pfi) భజరంగ్ దళ్‌పై (Bajrang Dal) నిషేధం విధిస్తామని కాంగ్రెస్ పార్టీ (congress) మేనిఫెస్టోలో రూపొందించిన సంగతి తెలిసిందే. విమర్శలు రావడంతో తలొగ్గి.. ఈ రోజు వెనక్కి తీసుకుంది. మధ్యప్రదేశ్ బబల్ పూర్లో గల కాంగ్రెస్ కార్యాలయాన్ని భజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్తలు ధ్వంసం చేశారు. కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్తలతోపాటు విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు బల్దేవ్బాగ్లో గల సిటీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద హంగామా చేశారు. అంతకుముందు కర్ణాటక కాంగ్రెస్ కార్యాలయం (karnataka congress office) వద్ద స్థానిక భజరంగ్ దళ్ కార్యకర్తలు ఘోరావ్ చేసిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామని ఒకరోజు ముందే భజరంగ్ దళ్ (Bajrang Dal) ప్రకటించింది. ఆ రోజు మధ్యాహ్నం సిటీ, రూరల్ కాంగ్రెస్ నేతలు సమావేశం ఉంది. ఇంతలో కొందరు నినాదాలు చేశారు. మరికొందరు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లారు. అక్కడ విధ్వంసం జరిగింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో భజరంగ్ దళ్ (Bajrang Dal), పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధం విధిస్తామని పేర్కొంది. దీనిపై భజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ఆందోళనలకు దిగారు. జబల్ పూర్ వద్ద మాత్రం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి రచ్చ రచ్చ చేశారు.