Etala Rajender Meet Ponguleti Srinivas Reddy:ఖమ్మం జిల్లాపై కమలనాథులు ఫోకస్ చేశారు. ఇక్కడ తమ పార్టీ బలహీనంగా ఉందని.. బలమైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు చేరితే బాగుంటుందని అనుకుంటోంది. పొంగులేటి ఇంటికి బీజేపీ ముఖ్యనేత ఈటల రాజేందర్ వెళ్లారు. ఆయనతో రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. తన ఇంటికి వచ్చిన నేతలకు పొంగులేటి (ponguleti) లంచ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పార్టీలో చేరిక గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) తమ పార్టీలో చేరాలని ఈటల రాజేందర్ కోరుతున్నారు. పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నారు. సమావేశం జరుగుతుండగానే అక్కడికి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వచ్చారు. అతనితో కూడా ఈటల రాజేందర్ (etala rajender) బృందం చర్చలు జరుపుతుంది. వీరిద్దరూ బీజేపీలో చేరితే బాగుంటుందని.. తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈటల రాజేందర్ (etala rajender) అనుకుంటున్నారు. అందుకోసమే ఇంటికెళ్లి మరీ చర్చలు జరుపుతున్నారు.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన జూపల్లి కృష్ణారావు (jupally krishna rao) తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాం ఏర్పాటు చేసి.. అమరవీరుల స్థూపం నిర్మించి.. అద్భుతంగా సచివాలయం కట్టినంత మాత్రానా సరిపోదని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు ఇస్తోన్న ప్రభుత్వం.. సర్పంచ్ల పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తోందని అడిగారు. లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల బిల్లుల రాక సర్పంచ్‌లు అల్లాడిపోతున్నారని తెలిపారు. బిల్లులకు సంబంధించి ఆర్థికశాఖ శ్వేతపత్రం విడుదల చేయాలని జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) బలమైన నేత. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి.. టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. నాలుగున్నరేళ్ల నుంచి ఏ పదవీ ఇవ్వకుండా ఖాళీగా కూర్చొబెట్టారు. అందుకోసమే పార్టీ, అధినేతపై సీరియస్‌గా ఉండేవారు. గత ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థులను ఓడించారనే అపవాదు ఉంది. మాజీమంత్రి తుమ్మల ఓటమిలో పొంగులేటి పాత్ర ఉందని ఖమ్మం జిల్లాలో చర్చ జరుగుతుంది. పువ్వాడపై ఫొకస్ చేసినప్పటికీ.. సొంత ఇమేజ్‌తో బతికి బయటపడ్డారు. జిల్లాలో ఒక ఎమ్మెల్యే గెలవడం.. కేటీఆర్‌తో సాన్నిహిత్యం వల్ల పువ్వాడకు మంత్రి పదవీ వరించిందనే చర్చ ఉండనే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒక్క బీఆర్ఎస్ సభ్యుడు కూడా గెలవబోడని పొంగులేటి అంటున్నారు. ఇదివరకు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరగగా.. 10 సీట్లు కావాలని కోరడంతో ఆ చర్చలు అక్కడికే ఆగాయి. మరీ బీజేపీ అయినా పొంగులేటి డిమాండ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలీ మరీ.