»Biker And Youtuber Agastya Chauhan Killed In Accident
YouTuber 300 కి.మీ స్పీడ్ తో బైక్ రైడ్.. యూట్యూబర్ దుర్మరణం
బైకులతో విన్యాసాలు చేస్తూ తన యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఉంటాడు. అతనికి దాదాపు 1.2 మిలియన్ల సబ్ స్క్రైబర్లు కూడా ఉన్నారు. చనిపోవడానికి 16 గంటల ముందు కూడా ఓ వీడియో షేర్ చేయడం గమనార్హం.
అతివేగం ఓ యూట్యూబర్ (YouTuber) ప్రాణం తీసింది. యూట్యూబ్ (YouTube)లో వీడియో కోసం బైక్ తో విన్యాసం చేయాలని భావించి దాదాపు 300 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లాడు.. అయితే అతి వేగానికి (Over Speed) బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ప్రముఖ యూట్యూబర్, ప్రొఫెషనల్ బైకర్ అగస్త్య చౌహాన్ (Agastya Chauhan) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం డెహ్రాడూన్ (Dehradun)కి చెందిన అగస్త్య చౌహాన్ వృత్తిరీత్యా బైకర్. అతడికి ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ప్రో రైడర్ 1000 పేరిట (PRO RIDER 1000) యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. బైకులతో విన్యాసాలు చేస్తూ తన యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఉంటాడు. అతనికి దాదాపు 1.2 మిలియన్ల సబ్ స్క్రైబర్లు కూడా ఉన్నారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో పెట్టేవాడు, ఆ వీడియోలను నెటిజన్లు కూడా విపరీతంగా ఇష్టపడేవారు. చనిపోవడానికి 16 గంటల ముందు కూడా ఓ వీడియో షేర్ చేయడం గమనార్హం.
కాగా, అగస్త్య ఢిల్లీలో (Delhi) జరిగే మోటార్‌బైక్ రేసింగులో పాల్గొనేందుకు బుధవారం జడ్ఎక్స్10ఆర్ నింజా సూపర్‌బైక్‌పై ఆగ్రా నుంచి బయలుదేరాడు. ఉత్తరప్రదేశ్‌లోని టప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవేకు (Yamuna Expressway) చేరుకోగానే.. గంటలకు 300 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్న అగస్త్య బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అగస్త్య తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ప్రమాదం ధాటికి అతను ధరించిన హెల్మెట్ ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. హెల్మెట్ విరిగిపోవడంతో తలకు తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన అతడి అభిమానులను విషాదంలో ముంచింది.