సురక్షితంగా ఇంటికి చేరుస్తాడని నమ్మి అర్ధరాత్రి ముక్కూ మొఖం తెలియనివాడి బైక్ ఎక్కిన మహిళకు చేదు అనుభవం ఎదురయ్యింది. ర్యాపిడో డ్రైవర్ (Rapido driver) ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఐటీ సిటీ బెంగళూరులో వెలుగుచూసింది.సందు దొరికితే చాలు.. పోకిరీలు యువతుల పట్ల అసభ్య ప్రవర్తనకు దిగుతుంటారు. నీచమైన చేష్టలకు పాల్పడుతుంటారు. కొందరు ఇటువంటి ఘటనలు మౌనంగా భరిస్తారు. కానీ.. ఒక యువతి మాత్రం తనకు ఎదురైన ఘటనను ధైర్యంగా బయటపెట్టింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనపై జరిగిన నిరసనలో పాల్గొని ఇంటికి వెళ్లేందుకు బైక్‌ను బుక్ చేసుకున్న తనకు ఎదురైన దారుణమైన అనుభవాన్ని ఆమె ట్విట్టర్(Twitter)లో పంచుకున్నది.
బైక్‌పై వెళుతుండగా.. ఆ బైక్ డ్రైవర్(Bike driver).. మార్గమధ్యంలో హస్తమైధునం చేయమే కాకుండా.. అసభ్యకర్తంగా ప్రవర్తించాడంటూ ఆమె వెల్లడించారు. అంతేకాకుండా.. వేరే నంబర్ల నుంచి తనకు ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడని చెప్పింది. మణిపూర్(Manipur)లో ఇద్దరు మహిళలపై జరిగిన దారుణకాండపై బెంగళూరులోని టౌన్‌హాల్ వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న యువతి.. ఇంటికి వెళ్లేందుకు ఆటోలో, ట్యాక్సీలు బుక్ కాకపోవడంతో ర్యాపిడోబైక్(Rapidobike)ను బుక్ చేసుకున్నారు. కానీ.. తాను బుక్ చేసిన బైక్ నంబర్ కాకుండా వేరే బైక్‌పై డ్రైవర్ వచ్చాడని ఆమె ట్విట్టర్లో వెల్లడించింది