Amazon axe turns to India as part of global workforce reductions
Amazon : ఆర్థికమాంద్యం భయంలో ప్రపంచంలోని చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే ఉద్యోగులను భారీగా తగ్గించుకుంటున్నాయి. బడా కంపెనీలు సైతం రిట్రెంచ్ మెంట్(retrenchment) చేపడుతుండడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ కంపెనీ అమెజాన్(Amazon), రిట్రెంచ్‌మెంట్ భయంతో జనవరి 2024 వరకు భారతదేశంలో క్యాంపస్ ఇంటర్య్వూలను నిలిపివేసింది. అంతే కాకుండా అంతకుముందు జారీ చేసిన ఆఫర్ లెటర్లను పోస్టుపోన్ చేసింది. దీంతో దేశంలోని చాలా మంది ఐఐటీ విద్యార్థులు పెద్ద షాక్‌కు గురయ్యారు. నిజానికి ఈ రిక్రూట్మెంట్ జూన్ నెలలో జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ జనవరి 2024కి వాయిదా పడింది. ఆఫర్ లెటర్లు వాయిదా వేయడంతో చాలా మంది ఐఐటీ విద్యార్థులు నష్టపోయారు.
అమెజాన్‌లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్‌గా స్థానం సంపాదించిన ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్ తన ఆఫర్ లెటర్‌ను జూన్ ప్రారంభంలో కాకుండా జనవరి వరకు నిలిపివేసినట్లు తెలిపాడు. వివిధ క్యాంపస్‌ల నుండి అతనితో ఇంటర్న్‌షిప్ చేసిన చాలా మంది ఉన్నారు. వారి ఆఫర్ లెటర్లు కూడా ఆగిపోయాయన్నాడు. అదేవిధంగా, NIT విద్యార్థులకు కూడా వారి ఆఫర్ లెటర్లు వాయిదా పడినట్లు సమాచారం. ఆఫర్ లెటర్లు వచ్చిన తర్వాత కూడా రద్దు చేయబడిన సందర్భాలున్నాయి. IITల నుండి బాధిత గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఆరు నెలల సుదీర్ఘ నిరీక్షణ వ్యవధిపై ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రత్యేక పోస్టుల నియామకం
టెక్ పరిశ్రమలో తొలగింపులు కొనసాగుతున్నప్పటికీ, Google,Amazon వంటి అనేక ప్రధాన టెక్ దిగ్గజాలు యునైటెడ్ స్టేట్స్లో ప్రత్యేక హోదాల కోసం H1B విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అమెజాన్ CEO ఆండీ జాస్సీ మార్చిలో అదనంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించాలనే కంపెనీ నిర్ణయం గురించి ప్రకటన చేశారు.
అమెజాన్ తీరుపై తీవ్ర మండిపాటు..
టెక్ కంపెనీలో వాతావరణ పరిస్థితులపై కూడా ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఉద్యోగుల బృందం.. అమెజాన్ తీరుపై మండిపడింది. మారుతున్న ప్రపంచానికి అమెజాన్ అనుగుణంగా ఉండాలని, కంపెనీలో సౌకర్యవంతమైన వర్కింగ్ ఆప్షన్లను పరిష్కరించడానికి తమకు నిజమైన ప్రణాళికలు అవసరమని ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఎందుకంటే.. ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 18వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత అమెజాన్ ఇటీవల మరో 9వేల మంది ఉద్యోగులను తొలగించింది.
అమెజాన్ ప్రత్యేకించి యాడ్స్, హ్యుమన్ రీసోర్సెస్, ట్విచ్ యూనిట్లు, క్లౌడ్ కంప్యూటింగ్‌తో సహా అనేక విభాగాలలో ఉద్యోగులను తొలగించింది. అమెజాన్ ఉద్యోగాల తొలగింపులకు మరో కారణం.. ఓవర్‌హైరింగ్, అనిశ్చిత ఆర్థిక పరిస్థితులుగా అమెజాన్ చెబుతోంది. ఇప్పటికే అమెజాన్ రెండు సార్లు లేఆఫ్‌లను తీసుకుంటే.. ఇప్పటివరకు ఈ-కామర్స్ దిగ్గజం 27వేల మంది ఉద్యోగులను తొలగించింది.