»A Case Registered Chairperson Of The Womens Commission Who Worshiped The Evm In Maharashtra
Lok Sabha Elections: ఈవీఎంకు పూజ చేసిన మహిళా కమిషన్ చైర్పర్సన్.. కేసు నమోదు
దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం మూడవ దశ పోలింగ్ జరిగింది. అందులో భాగంగా మహారాష్ట్రలో పోలింగ్ జరిగే ముందు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈవీఎంకు హారతి ఇచ్చిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. దీంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
A case registered chairperson of the Women's Commission who worshiped the EVM in Maharashtra
Lok Sabha Elections: దేశమంత లోక్ సభ హడావిడి ఉంది. పలు రాష్ట్రాల్లో మంగళవారం మూడవ దశ పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ నియోజకవర్గంలోని ఖడక్వాసలా పోలింగ్ కేంద్రంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకంకర్ ఈవీఎంకు హారతి ఇచ్చారు. అంతే కాదు దీనికి సంబంధించిన ఫోటోలు సైతం తీసుకున్నారు. అనంతరం ఓటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకురాలుతో సహా పలువురు అధికారులు ఉన్నారు. అయితే ఈ పూజకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో మహిళ కమిషన్ చైర్‌పర్సన్‌పై రూపాలీ చకంకర్‌పై సింహగడ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ చర్యను ఎలా చూడాలి అని మాజీ జర్నలిస్ట్ రష్మీ పురాణిక్ రూపాలి చకంకర్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు ఇలా పూజలు చేయాలని కొత్త నిబంధనలకు ఏమైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. పోలింగ్ రోజు కేవలం హిందువులు మాత్రమే ఓట్లు వేయడానికి వస్తారా, ఇలా చేయడం ముస్లీంలు, క్రైస్తవులు, ఇతర మతస్తుల మనోభావాలను దెబ్బతీయడం కాదా అని మండిపడ్డారు. పూజలు చేసి, గంటలు మోగించి, హారతులు ఇస్తున్న సమయంలో ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇక ఈ నియోజకవర్గంలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ పోటీలో ఉన్నారు.
अब नेता लोग वोट करने से पहले मतदान कक्ष की पूजा कर रहे हैं! क्या तुम जिंदा हो @ECISVEEP ? क्या यह नियमों का उल्लंघन नहीं है? मोदी का परिवार बन चुके चुनाव आयोग क्या कोई कारवाई करेगा? दुनिया में चुनाव आयोग की निष्पक्षता का डंका बजना चाहिए! pic.twitter.com/rWAtF11YK6