»A 90 Feet 6 Thousand Kg Iron Bridge Belonging To Adani Company Was Stolen In Mumbai
Mumbai: 90 అడుగులు, 6 టన్నుల ఇనుప వంతెన మాయం
ఆదాని గ్రూపునకు చెందిన 6 వేల కేజీల భారీ ఇనుప వంతెనను చోరీ చేశారు. ముంబైలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దొంగతనం జరిగిన తీరుకు పోలీసులే ఆశ్చర్యపోయారు.
A 90 feet 6 thousand kg iron bridge belonging to Adani company was stolen in Mumbai.
Mumbai: అప్పుడప్పుడు కొన్ని విడ్డూరాలు జరుగుతుంటాయి. అలాంటి ఘటన ముంబాయి(Mumbai)లో జరిగింది. 90 అడుగుల పొడువైన 6 టన్నుల ఇనుప వంతెన( 6 thousand kg iron) రాత్రికి రాత్రే కనపడకుండా పోయింది. ముంబాయిలో నిత్యం బిజీగా ఉండే మలాడ్(Malad) ప్రాంతంలో ఓ వంతెన మాయం అయింది. ఇది ఆదాని ఎలక్ట్రిసిటీ సంస్థకు సంబంధించిన వంతెన అని దీనికి సంబంధించిన నలుగురి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
అదానీ సంస్థకు చెందిన భారీ ఎలక్ట్రిక్ కేబుళ్లను తీసుకెళ్లడానికి గత ఏడాది జూన్లో మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ కాలువపై తాత్కాలిక ఇనుప వంతెనను ఏర్పాటు చేసింది. కొన్నాళ్లకు ఈ వంతెన సరిపోదని ఈ ఏప్రిల్లో అదే కాలువపై మరో భారీ ఇనుప వంతెన నిర్మించారు. ముందు నిర్మించిన ఇనుప వంతెనను వాడడం లేదు. పట్టించుకోకవడంతో దుండగుల కన్ను పడింది. దానిని చోరీ చేశారు. రద్దీగా ఉండే మలాడ్ ప్రాంతంలో 6 వేల కేజీల బరువు ఉండే ఇనుప వంతెన కనిపించకపోవడంతో అందరు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఘటనపై అదానీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులకు దర్యాప్తు చేపట్టారు.
గ్యాస్ కట్టర్లతో వంతెనను ముందుగా కట్ చేసి రాత్రికి రాత్రే ఓ భారీ వాహనంలో అక్కడి నుంచి ఇనుమును తరలించారని తెలుకున్నారు. ఈ కేసులో వంతెన నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్న ఒక వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించారు. కాంట్రాక్ట్ పద్దతిలో వంతెనను నిర్మించే ఒప్పందంపై ఈ వ్యక్తి ఆదాని సంస్థలో ఉద్యోగిగా చేరినట్లు తెలుస్తుంది. మిగిలినా ముగ్గురు అతనికి సహకరించారని పోలీసులు తెలిపారు. ఈ చోరీ వెనుకా ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.