Bandi Sanjay: ప్రపంచానికి ప్రధాని మోడీ ఆదర్శంగా నిలిచారని తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. మోడీ ది బాస్ అని, ప్రపంచమే బాస్‌గా గుర్తించే మహానుభావుడు అన్నారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్ అందించారని.. ఇప్పుడు ఓరుగల్లు గడ్డ మీద నుంచి రూ.6 వేల కోట్ల పనులు ప్రారంభించడానికి వచ్చారని తెలిపారు. ఓరుగల్లు ఆర్ట్స్ కాలేజీ సభ వేదికపై బండి సంజయ్ మాట్లాడారు. ప్రధాని మోడీని ఏం మొహం పెట్టుకుని వస్తున్నారని కొందరు అంటున్నారని గుర్తుచేశారు. వరంగల్‌కు రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు వచ్చారని.. రూ.6 వేల కోట్ల అభివృద్ది పనులు ప్రారంభించేందుకు వచ్చారని వివరించారు. టెక్స్ టైల్ పార్క్ ఇచ్చేందుకు వచ్చారని పేర్కొన్నారు. మరీ ఈ రోజు కేసీఆర్ ఎందుకు రాలేదన్నారు. ఆయనకే మొహం లేదన్నారు. మోడీ వస్తే బిజీగా ఉంటారు. మోడీ వస్తే కొవిడ్ వస్తోందని బండి సంజయ్ (Bandi Sanjay) విరుచుకుపడ్డారు.
తనకు బీజేపీ పదవులు ఇచ్చి, ఇంత వాడిని చేసిందని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 150 కోట్ల మందికి భరోసా ఇచ్చిన మహానుభావుడు మోడీ అని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. మోడీని ఓసారి దగ్గర నుంచి చూడాలని అనుకునేవాడిని, తనను సంజయ్ అని పిలువాలని కోరుకునేవాడినని గుర్తుచేశారు. బీజేపీ అధ్యక్ష పదవీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ (kcr) గడీల పాలను బద్దలు కొడతాం అని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మోడీ రాజ్యం, రామ రాజ్యం, కాషాయ రాజ్యం వస్తోందని అన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అని సభ వేదిక నుంచి బండి సంజయ్ పిలుపునిచ్చారు.