ప్రపంచ ట్రేడ్ వ్యాల్యూ సరికొత్త గరిష్టానికి చేరుకుంటోంది. 2023లో తిరిగి మందగమనం ఉండవచ్చుననే ఐక్య రాజ్య సమితి అంచనాలకు ముందు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్లోబల్ ట్రేడ్ వ్యాల్యూ 12 శాతానికి పెరిగి, 32 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చునని తెలిపింది. ఎనర్జీ ఉత్పత్తుల ట్రేడ్ భారీగా పెరగడంతో ట్రేడ్ గ్రోత్ వృద్ధి కనిపిస్తోందని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ తన ట్రేడ్ అండ్ డెవలప్మెంట్లో మంగళవారం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే మర్చంటైజ్డ్ గూడ్స్ వృద్ధి 10 శాతం పెరిగి 25 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. సేవల ట్రేడ్ ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగి, 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
భౌగోళిక రాజకీయ ఘర్షణలు, తక్కువ ఆర్థిక వృద్ధి, వస్తువులకు అధిక ధరలు, ప్రపంచ రుణాల రికార్డ్స్థాయి వంటి అంశాలు ప్రభావం చూపి వచ్చే ఏడాది ప్రపంచ వాణిజ్యం వ్యాల్యూ తగ్గుతుందని ఐక్య రాజ్య సమితి పేర్కొంది. వ్యాల్యూమ్ ఆధారంగా చూస్తే 2022లో అన్ని రంగాల్లో ట్రేడ్ వ్యాల్యూ పెరిగింది. అయితే వచ్చే సంవత్సరంలో బలహీనమైన ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్భణం అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలిగించే అవకాశముందని తెలిపింది.