తమిళ హీరో రజినీకాంత్ ప్రధాన పాత్రలో టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న మూవీ ‘వేట్టయాన్’. తాజాగా ఈ సినిమాపై రజినీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను అందుకుంటామని అన్నారు. ‘మా సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వాటిని ఈ మూవీ అందుకుంటుందని నేను ఆశిస్తున్నా. గతంలో నేను నటించిన దర్బార్ కూడా పోలీస్ యాక్షన్ డ్రామానే. కాకపోతే ఈ మూవీ చాలా విభిన్నంగా ఉంటుంది’ అని తెలిపారు.