ఈ ఏడాది దీపావళికి టాలీవుడ్లో సరికొత్త సందడి నెలకొంది. సాధారణంగా అమావాస్య రోజు సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు జంకుతారు. కానీ ఈ దీపావళికి ఎన్నడూ లేని విధంగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. విడుదల కావడమే కాకుండా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలకు మంచి రివ్యూలతో పాటు రేటింగ్లు వచ్చాయి. దీంతో థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో్ కళకళలాడుతూ సంక్రాంతిని తలపిస్తున్నాయి.