ఇటీవల విడుదలై ప్రేక్షకులను అలరించిన ’35- ఓ చిన్న కథ కాదు’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ వేదికగా అక్టోబరు 2వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన ’35- ఓ చిన్న కథ కాదు’ సినిమా సంచలన విజయం సాధించింది. నివేదా థామస్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.