కెజియఫ్.. ఈ మూడక్షరాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. చాప్టర్ వన్ ఇచ్చిన హైప్‌తో చాప్టర్2.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ముదులిపేసింది. మొత్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి.. హైయెస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాల్లో టాప్ 3లో నిలిచింది. దంగల్, బాహుబలి తర్వాత.. ట్రిపుల్ ఆర్‌ను వెనక్కి నెట్టి.. అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ పేర్లు దేశవ్యాప్తంగా మార్మోగిపోయాయి. ప్రశాంత్ నీల్ స్టైల్లో.. హీరో ఎలివేషన్స్ సీన్స్‌తో థియేటర్స్ షేక్ అయిపోయాయి. మొత్తంగా కెజియఫ్ చాప్టర్ 2 ఓ సంచలనం. అలాంటి సినిమా డిజాస్టర్‌గా నిలవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బిగ్ స్క్రీన్ పై సత్తా చాటిన ఈ చిత్రం.. బుల్లితెరపై మాత్రం చతికిలపడిపోయింది.
ఇటీవలె ఓ ప్రముఖ ఛానెల్లో ఈ చిత్రాన్నిటెలిక్యాస్ట్ చేశారు. దానికోసం సదరు ఛానెల్ భారీ ఎత్తున యష్ కటౌట్‌తో పబ్లిసిటీ చేసింది. దాంతో టీఆర్పీ రేట్లు బద్దలవడం ఖాయమనుకున్నారు. కానీ ఈ సినిమాకు బుల్లితెర షాక్ ఇచ్చింది. కేవలం 9.15 టీఆర్పీ రేటింగ్‌తో సరిపెట్టుకుంది కెజీయఫ్ చాప్టర్ 2. ఇది ఫస్ట్ పార్ట్ కంటే తక్కువ కావడం విశేషం. కేజీఎఫ్ చాప్టర్ వన్ 11.9 టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. దాంతో చాప్టర్ 2 కనీసం టీఆర్పీ 10 కూడా దాటకపోవడం షాకింగ్ అనే చెప్పాలి. ఇంతకు ముందు వచ్చిన డబ్బింగ్ సినిమాల్లో సగానికి సగం టీఆర్పీ రేటింగ్ కూడా రాలేదు. అయితే దీనికి ఓ బలమైన కారణమే ఉందని చెప్పొచ్చు. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో మౌత్ టాక్‌తో థియేటర్లకు పరుగులు తీశారు జనాలు. పైగా ఓటిటిలో ఒకటికి రెండు సార్లు చూసేశారు. కాబట్టి బుల్లితెరపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పాలి.