Video Viral: జాతి రత్నాన్ని ఉంచుకుంటా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాను ప్రమోట్ చేయాలంటే.. ఏదో విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా కామెంట్స్ చేయాల్సిందే. కొన్ని కామెంట్స్‌తో ఆటోమేటిక్‌గా సోషల్ మీడియాలో సినిమా పై హైప్ వచ్చేస్తుంది. ఇది బాగా తెలిసిన ఓ హీరోయిన్ డైరెక్ట్‌గా డైరెక్టర్ మొహం మీదే.. నిన్ను ఉంచుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది. ఆ వీడియోని తనే స్వయంగా షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
మాళవిక నాయర్(Malavika Nair) అంటే.. గుర్తు పట్టడం కాస్త కష్టమే గానీ.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో నటించిన బ్యూటీ అంటే.. ఠక్కున గుర్తు పడతారు. ఈ సినిమాతో టాలీవుడ్(Tollywood)లోకి ఎంట్రీ ఇచ్చిన మాళవికా నాయర్.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. కానీ అనుకున్నంత స్థాయిలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది. రీసెంట్‌గానే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా కూడా మాళవికకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై భారీ ఆశలే పెట్టుకుంది. మాళవిక నాయర్, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘అన్ని మంచి శకునములే’ అనే సినిమా మే 18న విడుదల కాబోతుంది.
ఈ సినిమాకి నందిని రెడ్డి(Nandini reddy) దర్శకత్వం వహించారు. దాంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగా.. మాళవిక నాయర్ యంగ్ డైరెక్టర్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జాతి రత్నాలు సినిమా(Jatiratnalu Movie)తో హీరోల కంటే ఎక్కువగా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ కెవి అనుదీప్(KV Anudeep). ఈయన ఏం మాట్లాడినా చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ జాతిరత్నాన్నే మాళవిక నాయర్ ఉంటుచుకుంటానని ఓపెన్‌గా చెప్పేసింది. మాళవిక, అనుదీప్ ఇద్దరు మెట్లు దిగుతూ వస్తుండగా.. నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అంటూ.. ‘నిన్ను ఉంచుకుంటాను అబ్బాయ్’ అని చెప్పేసింది మాళవిక. దానికి మన జాతిరత్నం తెగ సిగ్గుపడిపోయాడు. ఈ వీడియోని మాళవిక నాయర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్(Video viral) అవుతోంది. దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.