Vijay: దళపతి విజయ్ షాకింగ్ డెసిషన్.. మూడేళ్లు సినిమాలకు బ్రేక్..?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్లో ఎంత ఫేమస్ అయ్యాడో టాలీవుడ్లో కూడా అంతే ఫేమస్. ప్రస్తుతం విజయ్ లియో సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇటీవలే వచ్చిన మాస్టర్ సినిమా ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్లో ఎంత ఫేమస్ అయ్యాడో టాలీవుడ్లో కూడా అంతే ఫేమస్. ప్రస్తుతం విజయ్ లియో సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇటీవలే వచ్చిన మాస్టర్ సినిమా ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ ఎవరూ ఊహించని ప్రకటన చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వెంకట్ ప్రభు సినిమా తర్వాత విజయ్ మూడేళ్ల పాటు సినిమాలకు విరామం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విద్యార్థులతో సమావేశమై అభినందించడం కూడా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు విజయ్ పొలిటికల్ ఎంట్రీని తిరస్కరించిన అభిమానులు కూడా ఈ ఒక్క సంఘటనతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమని ఫిక్స్ అయిపోయారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి మూడేళ్లు గ్యాప్ తీసుకోవాలని వెంకట్ ప్రభు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. తమిళనాడులో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నాడు. గత ఎన్నికల సమయంలో విజయ్ ఏ పార్టీకి ఓటు వేయాలో తన అభిమానులకు సూచించాడు. దీంతో తమిళనాడులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరి విజయ్ పార్టీ పెడుతున్నాడా లేక ఈ పార్టీకి మద్దతు పలుకుతాడా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు విజయ్ సినిమాలకు మూడేళ్లు గ్యాప్ ఇవ్వడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.