రౌడీ హీరో విజయ్ దేవరకొండకు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. ఇప్పటికే లైగర్‌తో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అంతకు ముందు కూడా రౌడీది అదే పరిస్థితి. అందుకే వీలైనంత త్వరగా రౌడీకి ఓ హిట్ కావాలి. అందుకోసం ఓ బడా ప్రొడ్యూసర్ భారీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు రౌడీ హీరో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మాత్రమే కనిపిస్తాయి. ఈ చిత్రాలు తప్పితే మిగతా వాటిలో కొన్ని సోసోగా నిలవగా.. మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా లైగర్‌కు ముందొచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో ‘లైగర్’తో పాన్ ఇండియాను షేక్ చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. దాంతో నెక్ట్స్ ఎలాగైనా సరే పాన్ ఇండియా మార్కెట్ దగ్గర సత్తా చాటాలనుకుంటున్నాడు రౌడీ.
అయితే ఇప్పటికే పూరితో కమిట్ అయిన జనగణమన ఆగిపోయినట్టు తెలుస్తోంది. దాంతో రౌడీ ఆశలన్నీ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఖుషీ’ మూవీ పైనే ఉన్నాయి. అయితే ఇది లవ్ స్టోరీ కాబట్టి.. పాన్ ఇండియా స్టార్డమ్కు ఎంత వరకు ఉపయోగపడుతుందనేది సందేహమే. అందుకే ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. గతంలో ఎప్పుడో దిల్ రాజుతో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు రౌడీ. అయితే ఇప్పుడు లైగర్ దెబ్బకు రౌడీకి మంచి హిట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడట దిల్ రాజు. ఈ నేపథ్యంలో గబ్బర్ సింగ్ డైరెక్టర్‌తో హరీష్ శంకర్‌తో విజయ్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం పవన్‌తో భవధీయుడు భగత్ సింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు హరీష్. ఈ లోపు విజయ్‌తో సినిమా చేసేలా రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.