Madhuri Dixit : నెట్‌ఫ్లిక్స్‌కి ఊహించని షాక్ .. లీగల్ నోటీసులు జారీ
మాధురి దీక్షిత్ (Madhuri Dixit) విషయంలో మాత్రం నెట్‌ఫ్లిక్స్‌కి (Netflix) ఊహించని షాక్ తగిలింది. ‘ద బిగ్ బ్యాంగ్ థియరీ’ (The Big Bang Theory) 'సీజన్ 2లో మాధురిపై చేసిన అవమానకరమైన కామెంట్.. నెట్‌ఫ్లిక్స్‌ని చిక్కుల్లో పడేసింది. ఆల్రెడీ తీవ్ర విమర్శలపాలవ్వగా.. ఇప్పుడు ఏకంగా లీగల్ నోటీసుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.సెన్సార్ లేదనో లేక తాము పూర్తి స్వేచ్ఛ తీసుకోవడం వల్లనో తెలీదు కానీ.. రానురాను ఓటీటీ కంటెంట్ మాత్రం మరీ హద్దు మీరిపోతోంది.
మాధురి దీక్షిత్ (Madhuri Dixit) విషయంలో మాత్రం నెట్‌ఫ్లిక్స్‌కి (Netflix) ఊహించని షాక్ తగిలింది. ‘ద బిగ్ బ్యాంగ్ థియరీ’ (The Big Bang Theory) ‘సీజన్ 2లో మాధురిపై చేసిన అవమానకరమైన కామెంట్.. నెట్‌ఫ్లిక్స్‌ని చిక్కుల్లో పడేసింది. ఆల్రెడీ తీవ్ర విమర్శలపాలవ్వగా.. ఇప్పుడు ఏకంగా లీగల్ నోటీసుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.సెన్సార్ లేదనో లేక తాము పూర్తి స్వేచ్ఛ తీసుకోవడం వల్లనో తెలీదు కానీ.. రానురాను ఓటీటీ కంటెంట్ మాత్రం మరీ హద్దు మీరిపోతోంది. అడల్ట్ కంటెంట్ విషయంలోనే కాదు.. డైలాగుల్లోనూ బరితెగించేస్తున్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా అసభ్యకరమైన డైలాగ్స్ పెట్టేస్తున్నారు. వీటిపై ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.. ఓటీటీ (OTT) కంటెంట్ క్రియేటర్స్ తీరు మాత్రం మారట్లేదు. ఎవరేం చేస్తారనే ధీమాతో.. మరింతగా రెచ్చిపోతూనే ఉన్నారు. కానీ.. అసలు విషయం ఏమిటంటే.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ద బిగ్ బ్యాంగ్ థియరీ సీజన్ 2లోని ఒక ఎపిసోడ్లో జిమ్ పార్సన్స్, కునాల్ నయ్యర్ (Kunal Nayyar) మధ్య ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) మాధురి దీక్షిత్‌లకు సంబంధించిన సంభాషణ నడుస్తుంది.
జిమ్ పార్సన్స్ ఒక సన్నివేశంలో ఐశ్వర్యను పేదోడి ‘మాధురీ దీక్షిత్’గా పేర్కొంటాడు. అప్పుడు కునాల్ వెంటనే అందుకొని.. ‘కుష్టురోగి వంటి మాధురీ దీక్షిత్‌తో పోలిస్తే ఎలా? ఐశ్వర్య ఒక దేవత’ అని అంటాడు. దీనిపై బాలీవుడ్ (Bollywood) వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మాధురి దీక్షిత్ లాంటి స్టార్ నటిని అవమానించేలా.. ఆ కామెంట్ ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు. బాలీవుడ్ నటి, ఎంపీ, అమితాభ్ బచ్చన్ భార్య అని జయ బచ్చన్ (Jaya Bachchan) ఇప్పటికే ఈ విషయంపై విరుచుకుపడ్డారు. కునాల్‌కి ఏమైనా పిచ్చి పట్టిందా, అతడ్ని వెంటనే మానసిక ఆసుపత్రికి తరలించాలి, అతని కామెంట్స్ పట్ల కుటుంబ సభ్యుల్ని నిలదీయాలని అన్నారు. ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడు మిథున్ కుమార్ (Mithun Kumar) ఈ సన్నివేశంపై మండిపడుతూ.. నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్ నోటీసులు (Legal notices) పంపారు.