»Arrangements Are Complete For Ramulori Kalyan In Bhadradri
Sri Rama Navami : భద్రాద్రిలో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి..
దక్షిణాది అయోధ్యగా పేరొందిన భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రంలో రాములోరి కళ్యాణాన్నికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 30, గురువారం శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా సీత,రామ కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
దక్షిణాది అయోధ్యగా పేరొందిన భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రంలో రాములోరి కళ్యాణాన్నికి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 30, గురువారం శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా సీత,రామ కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ (CM KCR) పాల్గొంటారా.. లేదా అనే అంశంలో ఇంకా స్పష్టత లేదు. గతంలో ఉన్న సంప్రదాయానికి భిన్నంగా రామయ్య పెళ్లికి ఏడేళ్ల నుంచి సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. చివరగా 2016లో శ్రీరామ నవమి వేడుకలకు కేసీఆర్ దంపతులు హాజరయ్యారు.
చదవండి :
అయితే, తెలంగాణ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) భద్రాద్రి రాక ఖరారైంది. ఈ నెల 31న జరిగే పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ హాజరవుతారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం తగ్గిపోయింది. శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు లక్షల మంది తరలివస్తుంటారు. వీరిలో చాలా మంది గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే, ఈసారి నీళ్లు తక్కువగా ఉన్నందున భక్తులకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఎగువ నుంచి నీటిని వదిలే అవకాశం ఉన్నా… అధికారులు ఈ దిశగా ఆలోచించడం లేదు. ఇంకోవైపు భద్రాచలంలో ఉన్న మురుగునీరు లీకేజ్ రూపంలో గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో నీళ్లు కలుషితంగా కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో.. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) ఈ రోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
చదవండి :
అంతకుముందు ఆలయం వద్ద మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. భక్తులకు (Bhaktulaku) ఇబ్బందులు లేకుండా సెక్టార్ల వారీగా ఏర్పాట్లు చేశారు. ఆలయానికి అందమైన రంగులద్దారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులకు అందించేందుకు 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను తయారు చేస్తున్నారు. ఎక్కువ కౌంటర్ల ద్వారా తలంబ్రాలు, లడ్డు ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈనెల 31న జరిగే ‘పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం’ కోసం రెండు యాగశాలలు నిర్మించారు. ప్రతిరోజు రామాయణ మహాక్రతువు (Ramayana Mahakratu) నిర్వహిస్తున్నారు. పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కోసం దేశంలోని వివిధ నదుల నుంచి పుణ్య జలాలను భద్రాద్రికి తీసుకోవచ్చారు. పట్టాభిషేకం (Pattabhisekam) వేడుక కోసం ద్వాదశ సువర్ణ వాహనాలను సిద్ధం చేశారు.