Bandi Sanjay : కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే
Bandi Sanjay : తనకు కేటీఆర్ నోటీసులు పంపడం పై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. నోటీసులను తాను లీగల్‌గానే ఎదుర్కొంటానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
తనకు కేటీఆర్ నోటీసులు పంపడం పై బీజేపీ నేత బండి సంజయ్ స్పందించారు. నోటీసులను తాను లీగల్‌గానే ఎదుర్కొంటానని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘కేటీఆర్100 కోట్లకు నాపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. కేటీఆర్ పరువు ఖరీదు 100 కోట్లా? మరి యువత భవిష్యత్తు మూల్యమెంత? పేపర్ లీకేజీలో నా కుట్ర ఉందని కేటీఆర్ ఆరోపించారు. అలాగైతే ఆయనపై నేనెన్ని కోట్లకు దావా వేయాలి. పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. నష్టపోయిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ₹లక్ష ఇవ్వాల్సిందే. మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేసేదాకా పోరాడతాం’’ అని సంజయ్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇక పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే.. నిరుద్యోగులకు రూ.లక్ష ఇవ్వాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేటీఆర్ కు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. కేటీఆర్ నేడు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు బండి. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటన్నారు.
కేటీఆర్ ఒక స్వయం ప్రకటిత మేధావి అని.. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే అపరజ్ఞానిలా భావిస్తున్నారని.. ప్రశ్నిస్తే తట్టుకోలేని మూర్ఖుడని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పాలనలోని తప్పులను ఎత్తిచూపితే సహించలేని అజ్ఞాని అని.. కేసీఆర్ పాలనలో భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని ఆందోళన చేస్తే లాఠీలతో కొట్టించి కేసులు పెట్టి జైలుకు పంపిన దుర్మార్గుడని మండిపడ్డారు