»Trolling Again On Samantha Did She Go For Treatment
Kushi: సమంతపై మళ్ళీ ట్రోలింగ్.. వెళ్లింది ట్రీట్మెంట్ కోసమేనా!?
స్టార్ బ్యూటీ సమంత గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసిన సరే.. హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం సామ్ అమెరికాలో ఉంది. అయినా కూడా అమ్మడి పై ట్రోలింగ్ ఆగడం లేదు.
Trolling again on Samantha.. Did she go for treatment!?
Kushi: సమంత ఏం చేసినా కూడా సెన్సేషనే. అదే రేంజ్లో ఆమె పై ట్రోలింగ్ కూడా జరుగుతోంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ పై ఎన్నో విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. అలాంటి వారికి సమంత కౌంటర్ ఇచ్చినా కూడా ఆగడం లేదు. ఇప్పుడు కూడా సామ్ పై ట్రోల్ నడుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి సమంత నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. మయో సైటిస్ కారణంగా ఖుషి సినిమా షూటింగ్ అయిపోగానే సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది సామ్. వెంటనే విదేశాలకు వెళ్లిపోయింది. దీంతో ఖుషి ప్రమోషన్స్‌కు అమ్మడు వస్తుందా? రాదా? అని అనుకున్నారు. ఖుషి సినిమా ప్రమోషన్స్ కోసం మ్యూజికల్ కాన్సర్ట్‌లో విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేసి మరీ రచ్చ చేసింది. కానీ ఆ తర్వాత వెంటనే అమెరికాకు వెళ్లిపోయింది.
సమంత మాయోసైటిస్ ట్రీట్మెంట్ కోసమే న్యూయార్క్ వెళ్లింది అనుకున్నారు. అమ్మడు ఫోటో షూట్స్ చూస్తే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు కనిపించట్లేదు. ఫారిన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అమెరికాలో సమంత చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దీంతో ఖుషి ప్రమోషన్స్ చెయ్యకుండానే అమెరికా వెళ్లిపోయావ్.. కానీ అక్కడ ఇంత యాక్టీవ్‌గా కనబడుతున్నావ్.. అంటూ సమంతను ట్రోల్ చేస్తున్నారు కొందరు. కానీ సమంత వ్యవహారం చూస్తుంటే.. ఖుషి సినిమాని విజయ్ దేవరకొండ ఇండియాలో ప్రమోట్ చేస్తూ ఉంటే.. సమంత ఓవర్సీస్లో ప్రమోట్ చేస్తున్నట్టుంది. మొత్తంగా సమంత ఫారిన్ ట్రిప్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.