Dil se Movie: ట్రయాంగిల్ లవ్ స్టొరీ ‘దిల్ సే’ ఆగస్ట్ 4న విడుదల
ఈ మధ్య కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ కోవకు చెందిన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'దిల్ సే' విడుదల కానుంది. ఆగస్టు 4వ తేదిన ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అభినవ్ మదిశెట్టి, స్నేహ సింగ్ హీరో హీరోయిన్లుగా చేస్తున్న సినిమా దిల్ సే. ఈ మూవీకి మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని దర్శకత్వం వహిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ(Love story)తో ఈ మూవీ తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 4వ తేదిన విడుదల (Release) కానుంది.
ఈ మధ్యనే ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ (First song Release) విడుదలైంది. ‘రెండు కన్నులతో’ అనే సాగే ఆ పాట అందర్నీ ఆకట్టుకుంది. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట 2 మిలియన్ వ్యూస్ చేరుకోవడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. శ్రేయా ఘోషల్ ఈ పాటను పాడగా శ్రీకర్ మ్యూజిక్ అందించారు. యూత్‌తో పాటుగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా దిల్ సే మూవీ బాగా నచ్చుతుందని మేకర్స్ తెలిపారు.
వన్ మీడియా ఈ మూవీని విడుదల చేయనుంది. యూత్ లవ్ స్టోరీ(Youth Love Story)తో సాగే ఈ మూవీపై ఫ్యామిలీతో కలిసి చూడాలని మేకర్స్ అన్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అందరికీ కనెక్ట్ అవుతుందని, పాటలు అందర్నీ అలరిస్తాయని దిల్ సే చిత్ర యూనిట్(Makers) తెలిపింది.