»Tillu Square Trailer Jumbled Hot Ladies%e2%81%ac Where You Fall Every Time
Tiilu Square Trailer: ప్రతిసారి ఎక్కడ పడతావ్ రా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్‌ని!
యంగ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గతేడాది డీజే టిల్లు చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా రాబోతుంది. మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Tiilu Square Trailer: యంగ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గతేడాది డీజే టిల్లు చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. మల్లిక్ రామ్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, పోస్టర్స్, టీజర్ ప్రతిది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీటితో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. మూవీ టీం తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దీంతో సినిమా ఓ రేంజ్లో ఉంటుందని ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు.
టిల్లు మొబైల్లో మాట్లాడుతూ.. మార్కస్ చెప్పు.. పెట్టిర్రు ఇప్పుడే పెద్ద ముద్ద.. అనే సెటైర్ డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది. టిల్లు తండ్రి మళ్లి ఏ పంచాయితీలా ఇరుకున్నావ్ అని అడుగుతాడు. అనుపమతో రొమాన్స్, తన చేతిలో టిల్లు బలైనట్లు చూపిస్తారు. ప్రతిసారి ఎక్కడ పడతావ్ రా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్‌ని అంటూ ప్రిన్స్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూస్తుంటే డబుల్ కామెడీతో సిద్ధు అలరించనున్నట్లు తెలుస్తోంది.
సిద్ధు స్టైల్, డైలాగ్ డెలివరీ, హీరోయిన్‌తో రొమాన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ చిత్రానికి రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై టిల్లు స్క్వేర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఎంతగానో ఈ చిత్రం గురించి వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలై ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూద్దాం.