»Prathinidhi 2 Trailer If The States Debts Are Increasing How Are Your Assets Increasing Sir
Prathinidhi 2 Trailer: రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే.. మీ ఆస్తుల ఎలా పెరుగుతున్నాయి సార్?
సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్ తాజాగా ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కాగా మేకర్స్ తాజాగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
Prathinidhi 2 Trailer: If the state's debts are increasing.. how are your assets increasing sir?
Prathinidhi 2 Trailer: సోలో, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. చాలా ఏళ్ల నుంచి నారా రోహిత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. మళ్లీ చాలా రోజుల తర్వాత ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తొమ్మిదేళ్ల కిందట ఆయన హీరోగా నటించిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తుంది. ఈ సినిమాకి సీనియర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంతో మూవీ మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తూ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రానున్నట్లు తెలుస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ మరణించిన తర్వాత గుండెపోటుతో ఎంతమంది మరణించారని రోహిత్ అడగడంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. నారా రోహిత్ ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. ట్రైలర్‌లోని డైలాగ్‌లు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ కుటుంబం కంటే నాలుగు సంక్షేమ పథకాలు ఇచ్చిన రాజకీయ నాయకుడు ముఖ్యమా? అనే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.
అజయ్ ఘోష్‌ని నారా రోహిత్ ఇంటర్వూ చేయగా.. అందులో కొబ్బరి బొండాలు అమ్మను, బండి మీద బత్తాయి కాయలు అమ్మి, ఎన్నో వ్యాపారాలు చేసి ఇంతపెద్ద స్థాయికి వచ్చానని అంటాడు. దీనికి రోహిత్.. మరేంటి సార్ మీతోపాటు కాయలు అమ్ముకునేవాళ్లు ఇంకా కాయలు అమ్ముకుంటున్నారు. మీరు మాత్రం ఎలా కోటీశ్వరుడు అయ్యారు సార్. రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే.. మీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి? అనే డైలాగ్‌లు బాగున్నాయి. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్, రఘుబాబు, జిషు సేన్‌గుప్తా, యాంకర్ ఉదయ భాను, అజయ్ ఘోష్ , శ్రీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.