Pushpa2: ‘పుష్ప2’ తర్వాత ‘బన్నీ’ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే.. నాలుగోసారి
పుష్ప2 తర్వాత బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? డైరెక్టర్ ఎవరు? ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? అనే విషయాల్లో ఎలాంటి క్లారిటీ లేదు. అయితే పుష్ప2 రిలీజ్ తర్వాతే.. బన్నీ అప్ కమింగ్ ప్రాజెక్ట్ గురించి తెలిసే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు బన్నీ నెక్ట్స్ డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అది కూడా హ్యాట్రిక్ కాంబోనే అంటున్నారు.
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon star Allu arjun) ఫోకస్ మొత్తం పుష్ప2(Pushpa2) పైనే ఉంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నబన్నీ.. పుష్ప2తో మరోసారి దుమ్ములేపాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు బన్నీ. ఇప్పటికే చాలామంది డైరెక్టర్స్ బన్నీ కోసం వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ ఊహించని విధంగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కాకపోతే ఈ సినిమా ప్రభాస్‌తో స్పిరిట్ అయిపోయిన తర్వాత ఉంటుందని అంటున్నారు.
ఈ లోపు బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Director Trivikram srinivas)తో మరోసారి కలిసి పని చేయబోతున్నాడు. పుష్ప 2(Pushpa2) తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఇదే. ఈ సినిమాను సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్టు సమాచారం. గతంలో అల్లు అర్జున్(Allu arjun), త్రివిక్రమ్ కాంబినేషన్లో.. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలొచ్చాయి. ఈ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు త్రివిక్రమ్-బన్నీ. అందుకే పుష్ప2 తర్వాత.. ఈ క్రేజీ కాంబో రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్‌కు కమిట్ అవలేదు మాటల మాంత్రికుడు.
పుష్ప2(Pushpa2), ఎస్ఎస్ఎంబీ28 ప్రాజెక్ట్స్ ఇంచు మించు ఒకేసారి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడం పక్కా. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నట్టు సమాచారం. టైం దొరికినప్పుడల్లా.. మధ్య మధ్యలో త్రివిక్రమ్‌తో కథా చర్చలు జరుపుతున్నాడట త్రివిక్రమ్(Director Trivikram srinivas). మరి నాలుగో సారి ఈ కాంబినేషన్ ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.