హార్ట్ ఎటాక్ సినిమా(Heart Attack Movie)తో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ ఆదాశర్మ(Ada Sharma). ఈ ముంబై బ్యూటీ తాజాగా ది కేరళ స్టోరీ (The Kerala story Movie) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తొమ్మిదేళ్లకు ముందు ఆదా శర్మ ‘హార్ట్ ఎటాక్’తో వచ్చినా అది కమర్షియల్ హిట్ సాధించలేదు. ఆ సినిమా తర్వాత ఆదాకు అవకాశాలు కూడా రాలేదు. రెండు, మూడు సినిమాలు చేసినా వాటిల్లో కూడా ఆదా సెకండ్ హీరోయిన్ గానే కనిపించింది. గత నాలుగేళ్లుగా ఆదా శర్మ(Ada Sharma) ఏ సినిమాలోనూ నటించలేదు.
‘ది కేరళ స్టోరీ’ మూవీ ట్రైలర్ :
ఈ ఏడాది ‘సెల్పీ’ సినిమా(Selfie Movie)లో ఓ చిన్న పాత్రలో మాత్రమే ఆదా శర్మ(Ada Sharma) కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తోన్న సినిమా ది కేరళ స్టోరీ(The Kerala story Movie). ఈ మూవీకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ (Teaser)ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా ‘ది కేరళ స్టోరీ’ మూవీ ట్రైలర్ ను విడుదల(Trailer Release) చేసింది.
ట్రైలర్(trailer) చూస్తుంటే సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా చేస్తోంది. కేరళకు చెందిన షాలిని ఉన్నీకృష్ణన్ అనే హిందూ అమ్మాయి ముస్లిం యువతిలా ఎలా మారిందనే దానిపై కథ నడుస్తుంది. ఐసిస్ లో షాలిని చేరేలా ఎవరు ట్రాప్ చేశారనే దానిపై మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ (Trailer)లో చూపించారు. ట్రైలర్ లో ఆదా శర్మ(Ada Sharma) చెప్పే డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి. మే 5వ తేదీన తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్(Release) కానుంది.