»The Telugu Trailer Of Rajinikanth Starrer Lal Salaam Is Out
Lal Salaam Telugu trailer: ఆసక్తి రేపుతున్న లాల్ సలామ్ ట్రైలర్
రజనీకాంత్, కపిల్ దేవ్ అతిథి పాత్రల్లో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లాల్ సలామ్ ట్రైలర్ వచ్చేసింది. మతం, గొడవలు, క్రికెట్ ఆట నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా ఉంది.
The Telugu trailer of Rajinikanth starrer Lal Salaam is out
Lal Salaam Telugu trailer: ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajinikanth) రూపోందించిన తాజా చిత్రం లాల్ సలామ్(Lal Salaam). లైకా ప్రొడక్షన్స్ రూపోందించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్ – విక్రాంత్ ప్రధానమైన పాత్రలను పోషించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయనతో పాటు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఓ అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల అయింది.
క్రికెట్, రాజకీయం, మతం చుట్టూ ప్రాధానపాత్రలకు కవర్ చేస్తూ ట్రైలర్ ఉంది. ఇందులో రజనీకాంత్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. రజనీ కాంత్ లుక్ కూడా అదిరిపోయింది. ఈ పాత్రకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పారు. ఆయన కేవలం నమాజు చదివే మాములు వ్యక్తి కాదు బాషా ఫ్లాష్ బ్యాక్ ఉంది అనే ఒక డైలాగ్ ఉంది. దీంతో రజనీకాంత్ మాస్ కోణం ఏమన్నా చూపిస్తారా అనే ఆసక్తి పెరిగింది.