నటీనటులు – అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హోస్సేన్ రచన, దర్శకత్వం – ప్రవీణ్ సత్తారు నిర్మాతలు – సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP & నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంగీతం – మార్క్ కె రాబిన్
బంగార్రాజు మూవీ హిట్ తర్వాత మంచి జోరు మీదున్న హీరో అక్కినేని నాగార్జున..ఘోస్ట్ సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డామని ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకలో నాగ్ తెలిపారు. దుబాయ్ ఎడారుల్లో యాక్షన్ సీన్స్ చేస్తున్న క్రమంలో పలువురికి గాయాలు కూడా అయినట్లు చెప్పారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా కథెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టోరీ, ఎవరెలా చేశారంటే
ఈ మూవీలో హీరో నాగార్జున 40 ఏళ్ల పవర్ ఫుల్ ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా, పరిశోధన నేపథ్యంలో స్టోరీ కొనసాగుతుంది. ఈ చిత్రంలో నాగార్జున యాక్టింగ్ అదిరిపోయింది. అస్సలు ప్రాణం పెట్టి నటించాడని చెప్పవచ్చు. ప్రతి సీన్లో కూడా లీనమై నటించాడు. ఇక హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా తన యాక్టింగ్‌తో అదరగొట్టింది. నాగ్‌తో రొమాంటిక్ సీన్లలో మైమరపించిందనే చెప్పాలి. మరోవైపు గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవి వర్మ, బిలాల్ హోస్సేన్‌లు కూడా తమ క్యారెక్టర్ల మేరకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు
ఎడారిలో ఫైట్స్ మేకింగ్ సీన్స్ అదిరిపోయాయి. అదొక విజువల్ వండర్ అని చెప్పవచ్చు. మరికొన్ని యాక్షన్ సీన్స్ టేకింగ్ కూడా ఉత్కంఠ రేపింది. మరోవైపు సాంగ్స్ లొకేషన్స్ కూడా ఆకట్టుకున్నాయి. మార్క్ కె రాబిన్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగానే ఉన్నా..మరికొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తుంది.
చివరిగా
మొత్తంగా ఈ చిత్రం యాక్షన్ విత్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎని చెప్పవచ్చు. నాగ్ అభిమానులకు మాత్రం ఈ సినిమాలో కావాల్సిన రొమాన్స్, ఫైట్స్, ఉత్కంఠ రేపే సీన్స్ అన్ని దొరుకుతాయి. కాకపోతే ఫ్యామిలీ ప్రేక్షకులకు ఫైట్స్ కొంచెెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఫాస్టఫ్ త్వరగా ముగిసినా కూడా సెకండఫ్ కంక్లూడ్ చేయడంతో తడబడినట్లు అనిపిస్తుంది.